మార్చి 3న మేదరమెట్లలో ‘సిద్ధం’

బాపట్ల జిల్లా:  వైయ‌స్ఆర్‌సీపీ  ‘సిద్ధం’ నాలుగో సభ ఖరారైంది. మార్చి 3న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో వైయ‌స్ఆర్‌సీపీ సిద్ధం సభ నిర్వహించనున్నారు. రాప్తాడులో నిర్వహించిన సభను మించి మేదరమెట్ల సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సిద్ధం సభకు గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల కార్యకర్తలు హాజరుకానున్నారు. సభ ఏర్పాట్లపై తాడేపల్లిలోని  వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలతో  పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. 
 భీమిలి, ఏలూరు, రాప్తాడులలో నిర్వహించిన సభ­లకు జనం సంద్రంలా పోటెత్తడం.. జయహో వైయ‌స్ జగన్, మళ్లీ సీఎం జగనే అన్న నినాదాలతో సభా ప్రాంగణాలు ప్రతిధ్వనించడంతో   వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు సమరోత్సాహంతో కదం తొక్కుతున్నాయి.

కంచు కోటలను బద్దలు కొట్టేలా జరుగుతోన్న సిద్ధం సభకు కీలక ప్రాంతాలను వేదికలుగా   వైయ‌స్ఆర్‌సీపీ ఎంచుకుంటోంది. భారీ సభల నిర్వహణ ద్వారా రాజకీయంగా పైచేయి సాధించటంతో పాటుగా..   వైయ‌స్ఆర్‌సీపీ కేడర్‌లో కొత్త ఉత్సాహం పెరుగుతోందని భావిస్తున్నారు. ఈ సభలోనే సీఎం జగన్ కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. గెలుపు నినాదంతో పాటు రైతులకు, మహిళలకు సంబంధించిన కీలక ప్రకటన ఉంటుందని సమాచారం.

నాలుగు ముఖ్యమైన రీజియన్‌లలోని నాలుగు ప్రాంతాల్లో సిద్ధం సభలు పూర్తి అయిన తర్వాత పార్టీలో, ప్రభుత్వంలో కీలక సమావేశం ఉండవచ్చు. ఆ తర్వాత పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే అభ్యర్థుల ఖరారు పూర్తి కావడంతో పూర్తి స్థాయిలో ప్రచారంలోకి దూసుకెళ్తోంది  వైయ‌స్ఆర్‌సీపీ.

అద్దంకి సిద్ధం సభను చరిత్ర లో నిలవాలి: ఎంపి విజయసాయిరెడ్డి 
గుంటూరు, బాపట్ల,పల్నాడు,ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల మధ్యలో ఉన్న అద్దంకి వద్ద నిర్వహించాలని నిర్ణయం తిసుకున్నట్టు చెప్పారు..ఈ సభ వచ్చే నెల 3 న ఆదివారం అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం,కొర్సిపాడు మండలం, 
పిచ్చికలగుడిపాడు గ్రామ వద్ద జరుగుతుందని చెప్పారు..భీమిలి, ఏలూరు, రాప్తాడు సభలు ఎలా అయితే విజయవంతంగా నిర్వహించారో అదే విధంగా అద్దంకి సభను కూడా చరిత్రలో నిలిచిపోయే విధంగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గత మూడు సమావేశాలు విజయవంతమైన తరువాత తెలుగుదేశం పార్టీ నైతిక స్ధైర్యం దెబ్బతిందని..ఆ పార్టీ సంగ్ధిద్దంలో పడిపోయిందన్నారు. 
ఎన్నికలకు సిద్ధం అవుతున్న మన  పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఈ సిద్ధం సభలు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయాని చెప్పారు. మండల కేంద్రంగా కార్యకర్తలను సమీకరించాలని,దానికి పార్టీ అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు..
సభ వద్ద అన్ని మౌలిక సదుపాయలను పార్టీ కల్పిస్తుందని, సభ ఏర్పాట్లు,పర్యవేక్షణ కోసం 2000 మంది వాలంటీర్లు పని చేయనున్నారని తెలిపారు..సభ వద్ద...రహదారుల ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు ఏర్పాట్లు చూసుకుంటారని తెలియజేశారు..

న్యాయ విభాగ సమావేశం 

సమాజంలోని ప్రజలందరికీ ఆర్ధికంగా, రాజకీయంగా, సామాజికంగా అసమానతలు తొలగించాలనే ఉద్దేశంతో నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పాలనా కాలంలో ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేసిందని వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి విజయసాయిరెడ్డి అన్నారు..ఈ ప్రభుత్వం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికపరంగా తీసుకొచ్చిన సంస్కరణలను ప్రజలందరికీ వివరించాలని ఆయన పిలుపునిచ్చారు...తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యలయంలో శుక్రవారం   వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయ విభాగం ఆధ్వర్యంలో మంగళగిరి నియోజకవర్గ న్యాయవాదులతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయసాయిరెడ్డి సమావేశం  నిర్వహించారు..ఈ సందర్భంగా మంగళగిరిలో పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపుకోసం కృషి చేస్తామని న్యాయవాదులు  స్పష్టం చేశారు..అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..
రాష్ట్రంలో జూనియర్ న్యాయవాదులకు వైఎస్సార్ లా నేస్తం కార్యక్రమం అండగా నిలుస్తుందన్నారు..అర్హులైన జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.5000 స్టైఫండ్ చొప్పిన ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు.. ఏ రాష్ట్రం అమలు చేయనటువంటి కార్యక్రమాన్ని  దేశంలో మొదటి సారిగా జగన్ ప్రభుత్వం అమలు చేసిందని తెలిపారు..
ఏ న్యాయవాది అయిన మరణిస్తే బార్ కౌన్సిల్ నాలుగు లక్షల రూపాయలు ఇస్తుందని, దానిని మ్యాచింగ్ గ్రాంటుని ప్రకటించిన ప్రభుత్వం కూడ మనదేనని ఆయన అన్నారు...ఈ ప్రభుత్వం న్యాయవాదుల సంక్షేమ నిధి కింద 25 కోట్ల ఇచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు..దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం అమలు చేస్తొందన్నారు..

ఇంటి స్థలాలు,గృహ నిర్మాణాలు,మూడు రాజధానులు, కొన్ని సంక్షేమ పథకాలు అమలు విషయంలో తెలుగుదేశం పార్టీ  కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు..
ఈ దేశంలో ప్రజాస్వామ్యం  నిలబడటంలో న్యాయ వ్యవస్థ కీలకపాత్ర పోషించిందని చెప్పారు..న్యాయవాదులు న్యాయ వ్యవస్థని నిలబెట్టడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని చెప్పారు..

సమాజంలోని వివక్ష తొలిగించాలని రాజ్యంగంలో ఉందని,ఆ రాజ్యంగాన్ని చిత్తశుద్ధితో అమలు చేసి సమాజంలో అసమానతలు తొలిగించాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమతమని చెప్పారు..దాని కోసం ముఖ్యమంత్రి జగన్ గారు సంక్షేమ పధకాలు,కార్యక్రమాలను అమలు చేస్తున్నారని చెప్పారు..ఈ కార్యక్రమానికి మంగళగిరి పార్టీ సమన్వయకర్త గంజి చిరంజీవి, పార్టీ న్యాయ విభాగ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి,ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి,న్యాయవాదులు పాల్గొన్నారు....

Back to Top