తాడేపల్లి: అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, పేదల విజయమని వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ నందిగం సురేష్ పేర్కొన్నారు. ఆర్5 జోన్‌లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి ఉందని బుధవారం తీర్పు వెలువరించడం పట్ల నందిగం సురేష్ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో నందిగం సురేష్ మీడియాతో మాట్లాడారు. నందిగం సురేష్ ఏమన్నారంటే.. అందరూ కలిసుండాలని సుప్రీం కోర్టు చెప్పడం సంతోషం: - టీడీపీ ముసుగులో రైతుల పేరుతో అమరావతిలో పేదవారికి ఇళ్లు ఇవ్వకూడదని కోర్టులకు వెళ్లారు - సుప్రీం కోర్టు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేదవాళ్లకు ప్లాట్లు ఇవ్వాలి..అందరూ కలిసుండాలని తీర్పునివ్వడం చాలా సంతోషం - టీడీపీ దీనిపై ఏడుపు గొట్టు రాజకీయం చేస్తోంది. - పేదవాళ్లు అమరావతి ప్రాంతంలో ఉండటానికి వీళ్లేదు..ఉంటే మేమే ఉండాలని అంటున్నారు. - అణగారిన వర్గాల వారు ఎవరున్నా మురికికూపం కింద మారుతుందని వారంటున్నారు. - పేద వారి మట్టి, చెమట వాసన తమకు అవసరం లేదంటున్నారు. - చంద్రబాబు ఇకనైనా కళ్లు తెరుస్తాడేమో అనుకున్నాం..కానీ రైతుల ముసుగులో టీడీపీ నాయకులను పెట్టి ఇంకా దీక్షలు చేయిస్తూనే ఉన్నాడు. - అమరావతి సంపదంతా ఆయన చేతిలో, ఆయన బినామీల చేతిలో ఉండాలని భావిస్తున్నాడు. - చంద్రబాబు ఆనాడు తుళ్లూరు ప్రాంతంలో లక్ష మంది జనం వచ్చేవరకూ నేను కంటిమీద కునుకు వేయను అన్నాడు. - ఈ రోజు అదే లక్ష మంది జగన్ గారు ప్లాట్లు ఇవ్వడం వల్ల వస్తుంటే.. అమరావతి ప్రాంతంలో మీరు ఉండటానికి వీళ్లేదని అంటున్నాడు. - మాటలు చెప్పడం కాదు..చేసి చూపించడం జగన్ గారి నైజం - పేదవాడు ఉంటే వారి భూముల మార్కెట్ ధరలు తగ్గిపోతుందని ఆందోళన చేస్తున్నారు. - ఈ రోజు విజయం జగన్ గారి నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలదే. - అమరావతిలో పేదలు ఉండకూడదన్న బాబు అండ్ కో.. కు ఇది చెంప దెబ్బ ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలు ఉంటే మీకొచ్చిన ఇబ్బంది ఏంటి..?: - అమరావతి భూములన్నీ వారి చేతుల్లోనే ఉండాలి..పేదవాళ్లు అక్కడ ఎవరు ఉండటానికి వీళ్లేదని అంటున్నారు. - మా ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలు ఉంటే మీకొచ్చిన ఇబ్బంది ఏంటి..? - పేదవాళ్లు ఉండకుండా చేయాలన్న చంద్రబాబు అండ్ కో చేస్తున్న దుర్మార్గపు ప్రయత్నాన్ని ప్రజలు గమనించాలి. - 23సీట్లు గెలిచిన నీకే అంత దమ్ముందంటే...151 సీట్లు గెలిచిన జగన్‌గారికి ఇంకెంత దమ్ముండాలి..? - ఇంత జరిగినా చంద్రబాబు ఇంకా నికృష్టపు, నీచపు బుద్ధినే ప్రదర్శిస్తున్నాడు. - 75 ఏళ్లు దగ్గర పడ్డాయి...తాడిచెట్టుకు వచ్చినంత వయసు వచ్చినా పేదవారిని తక్కువ చేసి మాట్లాడటం సబబు కాదు. - ఎస్సీల్లో ఎవరన్నా పుట్టాలని కోరుకుంటారా అని బాబు అంటాడు..ఎస్సీ లు స్నానం చేయరని ఆ పార్టీ నాయకులు అంటారు - అసలు ఈ రాష్ట్రంలో తిరగడానికి చంద్రబాబు, లోకేశ్‌లు అనర్హులు. - చంద్రబాబు పెద్ద తిమింగళం, రాష్ట్ర ప్రజలకు పట్టిన శని. - ప్రజలంతా ఈసారి చంద్రబాబును రాజకీయంగా తుదముట్టించాలి. *"పాపం పసివాడు" పవన్ ఎవరికి అనుకూలమో చెప్పాలి..? పేదలకా..బాబుకా..?:* - రాజకీయాల్లో ఓనమాలు తెలియని ఒక వ్యక్తి రైతుల గురించి మాట్లాడుతున్నాడు. - పాపం పసివాడు ఏమీ తెలియకుండా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు. - ఓ పక్క చంద్రబాబు పేదవాళ్లు ఉండటానికి వీళ్లేదంటుంటే పవన్ కళ్యాణ్ మాత్రం తన పార్టీని తాకట్టు పెట్టి సాగిలపడుతున్నాడు. - మీరు సంపద సంపాదించుకోవడానికే అధికారంలోకి రావాలి అనుకుంటే రాష్ట్రంలో మీకు ఆ అవకాశాలే లేవు. - చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు.. ఎవరికన్నా ఈ రాష్ట్రంలో సొంత ఇళ్లు ఉందా..? - చంద్రబాబుకు లింగమనేని ఇచ్చిన ఇంటిని ప్రభుత్వం అటాచ్ చేసింది. - పవన్ కళ్యాణ్ ఎవరికి అనుకూలమో చెప్పాలి. పేదలు ఉండటానికి వీళ్లేదంటున్న చంద్రబాబుకా..? లేదంటే ఇంటి స్థలం లేని పేదలకా అనేది స్పష్టం చేయాలి. - పవన్ కళ్యాణ్‌కు ఈ రాష్ట్రంలో ఇళ్లుందా..? కాల్‌షీట్ల ప్రకారం ఆయనకు ప్రజలు గుర్తుకు వస్తారు. - ఈ రాష్ట్రానికి దిక్చూచి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. - మీకు మానాభిమానాలు ఏమైనా ఉంటే అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి మీరు సంసిద్ధంగా ఉండాలి. ఇది పేదోడి విజయం...జగన్ గారి విజయం: - ఇది పేదోడి విజయం...జగన్ గారి విజయం. - సొంత ఇళ్లు లేని వారి బాధేంటో అద్దెఇళ్లలో ఉండే వారిని అడగండి.. - జగన్ గారిని ఓడించాలి అంటే కచ్చితంగా పేదవాడి జీవితాలతో మీరు ఆడుకున్నట్లే. - ఇకనైనా మౌనంగా ఉండండి..చంద్రబాబు నీ వయసుకు తగ్గట్లు హుందాగా వ్యవహరించండి..లేదంటే ప్రజలు చెప్పుతో కొడతారు. - అమరావతి నీ బాబుగాడి సొత్తు కాదు..పవన్ కళ్యాణ్, లోకేష్‌లదీ అంతకన్నా కాదు. - అందరూ కలిసి ఉండాలని కోర్టులు సైతం చెప్తుంటే పేదవాళ్లు ఉండటానికి వీళ్లేదని సుప్రీం కోర్టుకు నీ బినామీలను పంపడం దుర్మార్గం. - ఈ దుర్మార్గపు ఆలోచనకు తప్పకుండా మూల్యం చెల్లించుకోక తప్పదు. - జగన్ గారి చేతులు మీదుగా అమరావతిలో కచ్చితంగా ఇళ్ల పట్టాలిచ్చి తీరతాం.