వైయ‌స్‌ జగన్ పాలనలోనే రాష్ట్రంలో సామాజిక న్యాయం

చోడవరం సామాజిక జైత్రయాత్ర సభలో ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ 

 అనకాపల్లి:  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలోనే రాష్ట్రంలో సామాజిక న్యాయం జరిగిందని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ నేతలు అన్నారు. మంగళవారం జిల్లాలోని చోడవరం నియోజకవర్గంలో జరిగిన సామాజిక బస్సు యాత్ర తదనంతర బహిరంగ సభలో వివిధ వర్గాలకు సీఎం జగన్‌ చేసిన మంచితో పాటు టీడీపీ దుష్ప్రచారాన్ని జనాలకు వాళ్లు తెలియజేశారు.  చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ  నేతృత్వంలో ఈ సభ జరిగింది. 

గత ప్రభుత్వం వెనుకబడిన వర్గాలను పట్టించుకోలేదు. దళితుల్ని అవమానించిన వ్యక్తి  చంద్రబాబు. కానీ, వెనుకబడిన వర్గాలను జగన్‌ గుండెల్లో పెట్టుకున్నారు.  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు న్యాయం చేసిన నాయకుడు జగన్‌. కేబినెట్‌లో.. నామినేటెడ్‌ పోస్టుల భర్తీల్లోనూ వెనుకబడిన వర్గాల వాళ్లకే ప్రాధాన్యం ఇచ్చారు. అవినీతికి తావు లేకుండా సంక్షేమం అందించాం. కుల, మత.. రాజకీయ పార్టీలతో సంబంధంలేకుండా సంక్షేమ పథకాలు అందించాం.
సీఎం వైయ‌స్ జగన్‌ పాలన ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. రూ.2.67 లక్షల కోట్లను నేరుగా లబ్ధి దారుల ఖాతాలో జమ చేశాం. ఇచ్చిన హామీలు సీఎం జగన్‌ నెరవేర్చారు. కానీ, ప్రభుత్వంపై టీడీపీ విష ప్రచారం చేస్తోంది.  ఎవరెన్ని కుయుక్తులు పన్నినా.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీదే విజయం. ప్రజలు సీఎం వైయ‌స్ జగన్‌నే మళ్లీ కోరుకుంటున్నార‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు అన్నారు.  

Back to Top