సామాజిక సాధికారితకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్  కృషి

మంత్రి ఆదిమూల‌పు సురేష్‌

చంద్రబాబుకు మళ్లీ బుద్ధి చెప్పేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నారు

సామాజిక జైత్ర యాత్ర.. హోరెత్తిన చెన్నూరు

వైయ‌స్ఆర్‌ జిల్లా: కమలాపురం నియోజకవర్గం చెన్నూరులో ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, యువనేత నరేన్ రామాంజులరెడ్డిల అధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్ర సాగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రులు ఆదిమూలపు సురేష్, అంజాద్ బాషా,  మేరుగ నాగార్జున, కడప ఎంపీ వైయ‌స్ అవినాష్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా రేణుక,  ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ హాజరయ్యారు.
నమ్మి ఓటు వేసిందుకు సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం సామాజిక సాధికారితకు కృషి చేసిందని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. సీఎం వైయ‌స్ జగన్ విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు టీడీపీ నేతలు పేద పిల్లలకు ఇంగ్లీష్ విద్య వద్దన్నారు.. కానీ సీఎం ఇంగ్లీష్ మీడియాన్ని తీసుకువచ్చారన్నారు. ‘‘నేను దళితుడిని.. నేను మంత్రినయ్యా. కడప నుంచి ఓ మైనార్టీని డిప్యూటీ సీఎంను చేశారు. కులం, మతం చూడకుండా అందరిని సీఎం వైయ‌స్‌ జగన్ అభివృద్ది చేశారు. చంద్రబాబు మాత్రం కులాల మధ్య చిచ్చు పెట్టారు. కులాలను విడగొడితే వైయ‌స్ఆర్‌సీపీ ఓడిపొతుందని చంద్రబాబు అనుకుంటున్నారు’’ అని మంత్రి ఆదిమూలపు దుయ్యబట్టారు.

 కమలాపురం నియోజకవర్గంలోని చెన్నూరులో సాగిన సామాజిక సాధికార యాత్రకు వేలాదిగా జనం తరలివచ్చారు. నియోజకవర్గంలోని పల్లెపల్లెనుంచి జనం తరలి వచ్చారు. అధికశాతం బీసీవర్గాల వారు కాగా, ఈ తర్వాత ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ ప్రజలు ఉన్నారు. ర్యాలీ తర్వాత జరిగిన, బహిరంగ జనంతో కిక్కిరిసిపోయింది. జగన్‌ నినాదాలతో జనం సభను హోరెత్తించారు. రావాలి జగన్‌..కావాలి జగన్‌..మన జగన్‌ అంటూ వందలాది జెండాలు రెపరెపలాడాయి . నాయకులు ప్రసంగాలు ప్రజల్లో ఉత్సాహాన్ని రేకెత్తించాయి. నాలుగున్నరేళ్ల జగనన్న పాలనలో జరిగిన మంచిని ప్రజలకు కలిగిన మేలు గురించి వక్తలు వివరిస్తున్నప్పుడు...జై జగన్‌ అంటూ జనం నినదించారు. స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సభలో డిప్యూటీసీఎం అంజాద్‌భాషా, మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగనాగార్జున, కారుమూరి నాగేశ్వరరావులు, ఎంపీ అవినాష్‌రెడ్డి, మాజీ ఎంపీ బుట్టారేణుకలతో పాటు జిల్లాపరిషత్‌ ఛైర్మన్, ఆర్టీసీఛైర్మన్‌ యాదవ కార్పోరేషన్‌ ఛైర్మన్‌లతో పాటు స్థానిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు

 డిప్యూటీ సీఎం అంజాద్‌భాషా 

–సామాజిక సాధికారత 75 ఏళ్ల నుంచి వింటూ వస్తున్న నినాదం. కానీ, ఈనాడు జగనన్న ప్రభుత్వంలో సామాజిక సాధికారత ఒక విధానంగా తీసుకొచ్చి, విప్లవాత్మకమార్పులకు శ్రీకారం చుట్టారు.

– ఈరోజు బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలకు చెందిన వారికి పదవులు కట్టబెట్టి, మీముందు ఇలా నిలబడి, ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలిగే స్థాయిని ఇచ్చిన వ్యక్తి సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి.

–ఇప్పుడున్న జగనన్న మంత్రివర్గంలో 70శాతం వరకు బడుగు,బలహీనవర్గాల వారున్నారు, నలుగురు ఉపముఖ్యమంత్రులు బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందినవారే.

– ఈరోజు మైనార్టీవర్గాల గురించి మాట్లాడితే, చంద్రబాబు హయాంలో ఒక్కరంటే ఒక్కరు మైనార్టీ వర్గం వారు లేరు. కంటితుడుపుగా, ఎన్నికలకు మూడు నెలల ముందు ఒకరికి మంత్రి పదవి ఇచ్చిన దుర్మార్గం చంద్రబాబుది. అణగారిన వర్గాలను ఓటుబ్యాంకుగానే చూసే రాజకీయం చంద్రబాబుది.

–జగనన్న పాలనలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమపథకాలు అందుతున్నాయి. ఎక్కడా వివక్ష లేదు. ఇక వెనుకబడిన వర్గాలమైన మనం జగనన్నకు ఎంతో రుణపడిపోయాం. ఆయన్ని మళ్లీ గెలిపించుకోవడం మన ధర్మం.

–మన భవిష్యత్తుకు గ్యారంటీ జగనన్నే.

మన భవిష్యత్తుకు బాబు గ్యారంటీ అంటూ ఇప్పుడు టీడీపీ వాళ్లు ప్రచారం చేస్తున్నారు. మనం మళ్లీ నమ్ముతామా? బాబును నమ్మం కాక నమ్మం.

మన నమ్మకం జగనన్నే.

మన ఆశ జగనన్నే.

మన భవిష్యత్తుకు గ్యారంటీ జగనన్నే.

 

మంత్రి ఆదిమూలపు సురేష్‌ 

–ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన మాకు జగనన్న పాలనలో అందిన సాధికారత లబ్ది గురించి మీకు చెబుదామని ఇక్కడికి వచ్చాం.

–నాలుగున్నరేళ్ల క్రితం మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఈనాడు రాష్ట్రానికి ఎంతో మేలు జరిగింది. వైఎస్సార్‌ సీపీ పార్టీకి ఓటేసిన మీవల్లే ఈ సామాజిక సాధికారత సాధ్యమైంది. సామాజిక న్యాయమంటే ఏంటో తెలిసింది.

–అవినీతి రహితంగా, పారదర్శకంగా, సమర్ధంగా సాగుతోంది జగనన్న పాలన. బీఆర్‌ అంబేడ్కర్, జ్యోతిరావుపూలే, బాబుజగజ్జీవన్‌ రామ్‌ లాంటి మహనీయులు..అట్టడుగు వర్గాలకు మేలు జరగాలని నిరంతరం తపించారు.

– వారి ఆశయాల బాటలో నడుస్తున్న జగనన్న బడుగు,బలహీనవర్గాలవారిని చేయిపట్టుకుని ముందుకు తీసుకెళుతున్నారు.

–మన పిల్లల ఉజ్జ్వల భవిష్యత్తుకు..విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. సంక్షేమ పథకాలతో పేదలకు ఆర్థికస్వావలంబన దిశలో నడిపిస్తున్నారు సీఎం జగన్‌.

–బీసీ, ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలను ఏమాత్రం పట్టించుకోలేదు చంద్రబాబు. వారికి సామాజిక సాధికారత, న్యాయం చేయకూడదని చంద్రబాబు కుటిల రాజకీయాలు చేశారు. ఆయా వర్గాల వారిని చులకన చేశారు. అవమానించారు.

–ఈరోజు జగనన్న పాలనలో బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాల వారు పార్లమెంటు నుంచి గ్రామపంచాయితీ వరకు పదవుల్లో ఉన్నారంటే..అది జగనన్న సాధించిపెట్టిన సామాజిక సాధికారత వల్లే.

–మీకు ఏదైనా మంచి జరిగిందా? ఆర్ధిక లబ్ది జరిగిందా? అలా జరిగితేనే నాకు ఓటెయ్యమని చెబుతున్న దమ్మున్న నాయకుడు జగనన్న.

–మాట తప్పని మనిషి, ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చిన ముఖ్యమంత్రి జగనన్నే మన భరోసా. మన పిల్లల భవిష్యత్‌.

 మంత్రి మేరుగ నాగార్జున 

–సామాజిక సాధికారత కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి... మహానుభావులెందరో సామాజిక న్యాయం సాధించాలని తమ జీవితాలు త్యాగం చేశారు

–ఈరోజు జగనన్న పాలనలో సామాజిక సాధికారత సాధ్యమైంది. పాలనలో అది ఒక విధానంగా మారింది.

–గతంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న మన వెనుకబడిన వర్గాలు ఈరోజు గర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఒక సామాజిక విప్లవాన్నే తీసుకొచ్చారు జగనన్న.

–బీసీలు, ఎస్సీలు,ఎస్టీలు, మైనార్టీలు, పేదప్రజలందరూ మిగతావారిలా ఆర్థికంగా ఎదగాలని, పేదపిల్లల చదువులకు పేదరికం అడ్డుకాకూడదని సంక్షేమపథకాలతో ఓ చరిత్రనే సృష్టించారు ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి.

–రాష్ట్రంలో 12శాతం ఉన్న పేదరికం దాదాపు సగం 6శాతానికి ఈ నాలుగున్నరేళ్లలో తగ్గిందంటే జగనన్న పాలన గొప్పతనమే. జగనన్న పేదల పక్షపాతి.

 మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు 

–నా ఎస్సీ,నా ఎస్టీ,నా బీసీ, నా మైనార్టీలంటూ మనల్ని అందరినీ అక్కున చేర్చుకున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. ప్రేమను పంచారు. చేయూతనిచ్చారు భరోసాగా నిలిచారు. అన్నిరంగాల్లోనూ మన వర్గాలను నిలిపారు. రాజకీయంగా పెద్దపదవులు కట్టబెట్టారు.

– పేదలు పేదలుగానే ఉండిపోవాలా..? వారు ఆర్థికంగా ఎదగాలి. ఆ కుటుంబాల తలరాతలు మారాలి. ఆ ఇళ్లల్లో పిల్లలు పెద్దచదువులు చదవాలి. ఉన్నత ఉద్యోగాలు సాధించాలి..అని ఆలోచించిన ప్రజానాయకుడు మన ముఖ్యమంత్రి.

–తన ఆలోచనలకు ఆచరణ రూపమిచ్చి, దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమపథకాలు తీసుకొచ్చారు.

– పేదలకు నేరుగా సంక్షేమఫలితాల లబ్ది అందేలా చేశారు. ప్రజల వద్దకు పాలన అనే మాటను నిజం చేసి చూపారు సీఎం జగనన్న.

–మన కుటుంబం, మన గ్రామం, మన నియోజకవర్గం, మన జిల్లా, మన రాష్ట్రం సమగ్రాభివృద్ధి కోసం జగనే రావాలి...జగనే కావాలి.

 

ఎంపీ అవినాష్‌ రెడ్డి 

–నియోజవర్గం నలుమూలల నుంచి సామాజిక సాధికార యాత్రకు తరలివచ్చిన వేలాదిమందిని చూస్తుంటే... జగనన్న మీద ప్రజలకున్న అంతులేని అభిమానం కళ్లకు కడుతోంది.

–సామాజిక సాధికారతకు అసలు సిసలు నిర్వచనం జగనన్న ప్రభుత్వం.

–సామాజిక సాధికారత అంటే ఏమిటో తన పాలన ద్వారా చేసి చూపిస్తున్నారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.

–బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలను అక్కున చేర్చుకోవడమే కాకుండా, చట్టసభల్లో అత్యున్నత స్థానాల్లో కూర్చోబెట్టారు. అలాగే స్థానిక సంస్థల్లోనూ పెద్దపీట వేశారు.

–చంద్రబాబు గతంలో ఎన్నికల సమయంలో చేసిన హామీలేవీ..అధికారంలోకి వచ్చాక నెరవేర్చలేదు. రైతులు, డ్వాక్రామహిళలు..ఇలా ఆయన పాలనలో మోసపోని వర్గాలంటూ ఏవీ లేవు.

–జగనన్న ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చారు. అభివృద్ధి పనులు పారదర్శకంగా సాగేలా చేస్తున్నారు.

– ఇక సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఉద్యోగాల కల్పనలో విప్లవాన్నే సృష్టించారు. లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాల కల్పన జరిగింది.

– గ్రూప్‌–1, గ్రూప్‌–2 , మెడికల్‌ కాలేజీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.

–ఇక విద్య,వైద్యరంగాల్లో సాధించిన ప్రగతి దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించింది.

 

మాజీ ఎంపీ బుట్టారేణుక 

–ప్రతి పేదవాడికి గుండెధైర్యం నింపుతూ, నేనున్నా అండగా మీకు అని చక్కటి పాలన చేస్తున్నారు జగనన్న.

–బడుగు,బలహీన వర్గాలకు చేయూత నిస్తున్నారు. పదవుల్లో కూర్చోబెడుతున్నారు. –మహిళలకు ప్రత్యేక పథకాలతో ఆర్థిక స్వావలంబన సాధించేలా చేస్తున్నారు. –సమన్యాయం అంటే ఏమిటో తన పాలన ద్వారా నిరూపిస్తున్నారు జగనన్న.

–పక్కనే ఉన్న రాష్ట్రంలో కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి, మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పాలనను ఆదర్శంగా తీసుకుని..ముందుకు పోవాలని అన్నారు. వైఎస్‌గారి పాలన అంత అద్భుతంగా ఉందన్నమాట.

–మహానేత తనయుడిగా... జగనన్న మరింత మంచి పాలన అందిస్తున్నారిప్పుడు. మనం చూస్తున్నాం. ఫలితాలు పొందుతున్నాం. 

ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి 

–నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మీ అభిమానం చూస్తుంటే కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి.

–జగన్‌మోహన్‌రెడ్డి మీద అభిమానంతో ..ఆయన రాకున్నా..ఆయన ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ సామాజిక యాత్రకు పల్లెపల్లె నుంచి తరలివచ్చిన మీకు ధన్యవాదాలు.

–ఈరోజు బడుగు, బలహీనవర్గాల వారు, పేదప్రజలు సంతోషంగా ఉన్నారంటే. భరోసాగా,ధీమాగా బతుకుతున్నారంటే...సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాలనవల్లనే.

– ఆయనకు పేదలంటే ప్రాణం. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాలంటే అంతులేని అభిమానం.

–సామాజిక సాధికారతను ఆచరణలోకి తీసుకొచ్చి ...చట్టసభల్లో పెద్దపదవుల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాలవారిని కూర్చోబెట్టారు జగన్‌మోహన్‌రెడ్డి.

–రూ.4,450కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ఈ కమలాపురం నియోజకవర్గంలో జరుగుతున్నాయంటే..అదంతా సీఎం జగన్‌ తోడ్పాటు వల్లనే. ఆ పనులన్నీ త్వరలో పూర్తవుతాయి.

–ప్రతి గడపకూ..సంక్షేమపథకాలు అందించిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డిదే.

–ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తూ, ప్రజల్ని కష్టనష్టాల్లో ఆదుకుంటూ..జగన్‌మోహన్‌రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారు.

తాజా వీడియోలు

Back to Top