తాడేపల్లి: సామాజిక విప్లవ సారథి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనకు ప్రజలు అడుగడుగునా జేజేలు పలుకుతున్నారు. వైయస్ఆర్‌సీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రను హర్షాతిరేకాలతో స్వాగతిస్తున్నారు. ‘జగనన్నే మా భవిష్యత్తు.. జగనే రావాలి.. జగనే కావాలి’ అంటూ అన్ని వర్గాలూ ఒక్క గళమై నినదిస్తున్నారు. గత 53 నెలలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు చేస్తున్న మంచిని వివరించడానికి సీఎం వైయస్ జగన్ నాయకత్వంలో చేపట్టిన సామాజిక సాధికార యాత్రకు భారీ స్పందన లభిస్తోంది. నాలుగో రోజు సామాజిక సాధికార యాత్ర అల్లూరి జిల్లా పాడేరు, ఏలూరు జిల్లా దెందులూరు, నెల్లూరు జిల్లా ఉదయగిరిలో కొనసాగనుంది. పాడేరు సమీపంలోని వంతాడపల్లి చెక్ పోస్టు నుంచి సోమవారం ఉదయం 10:30 గంటలకు బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ►ఉదయం 11 గంటలకు పాడేరు మెడికల్ కాలేజీ పనులను పరిశీలించనున్న పార్టీ నేతలు. ►11:15 గంటలకు వైయస్ఆర్‌సీపీ నేతల మీడియా సమావేశం ►11:30 గంటలకు మోదకొండమ్మ తల్లి స్టేడియం నుంచి బైక్ ర్యాలీ. ►మధ్యాహ్నం 12 గంటలకు కిందిబజార్ వద్ద బహిరంగ సభ. నెల్లూరు జిల్లాలో ఇలా... ►నెల్లూరు జిల్లా వింజమూరులో చిన్నకేశవ స్వామి టెంపుల్ నుండి బయలుదేరనున్న బస్సుయాత్ర ►జగీరవనంలో 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్న పార్టీ నేతలు ►దుత్తలూరు మీదుగా ఉదయగిరి చేరుకోనున్న బస్సుయాత్ర ►హైస్కూల్ గ్రౌండ్‌లో మధ్యాహ్నం 3:30 గంటలకి బహిరంగ సభ ఏలూరు జిల్లాలో ఇలా.. ►ఏలూరు జిల్లాలో దెందులూరు మండలం సోమవరప్పాడు నుండి బస్సు యాత్ర మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం ►వీరభద్రాపురం గ్రామం వద్ద అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళుల్పించనున్న నేతలు ►గోపన్నపాలెం వద్ద సాయంత్రం నాలుగు గంటలకు బహిరంగ సభ