మా కుటుంబంపై అక్రమ కేసులు

కాపు వైయ‌స్ఆర్‌ సీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి 
 

అనంతపురం: టీడీపీ నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకుని మా కుటుంబంపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని రాయదుర్గం వైయ‌స్ఆర్‌ సీపీ అభ్యర్థి కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. శనివారం కాపురామచంద్రారెడ్డి రాయదుర్గంలో విలేకరులతో మాట్లాడుతూ..టీడీపీ నాయకుల వ్యవహారంపై ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఎటువంటి స్పందన లేదన్నారు. అందుకే హైకోర్టును ఆశ్రయించనున్నామని తెలిపారు. ప్రచారానికి రాకుండా ప్రజలను కార్యకర్తలను పోలీసులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్పారు. ప్రజల సొమ్ముతో పోలీసులకు జీతాలు ఇవ్వడం జరుగుతుందే కానీ టీడీపీ నాయకులు ఇచ్చే జీతాలతో కాదని వ్యాఖ్యానించారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top