వైయస్‌ఆర్‌ సీపీ ఎదుర్కునే దమ్ము లేక ఓట్ల తొలగింపు

ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు

ఎన్నికల కమిషన్‌ డేగ కన్ను వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి

విశాఖలో వైయస్‌ఆర్‌ సీపీ నేతల నిరసన ర్యాలీ

విశాఖపట్నం: ప్రజాక్షేత్రంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని ఎదుర్కునే దమ్ము లేక దొడ్డిదారిన ఓట్లను చంద్రబాబు తొలగిస్తున్నారని వైయస్‌ఆర్‌ సీపీ నేతలు మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ సీపీ సానుభూతి పరుల ఓట్ల తొలగింపునకు నిరసనగా విశాఖలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు. సర్వేల పేరుతో తమ ఓట్లను గల్లంతు చేస్తున్నారని, ఇదేమని అడిగితే తిరిగి తమపైనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. బూత్‌ కన్వీనర్, ఇతర నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. విశాఖ ఈస్ట్, నార్త్‌ నియోజకవర్గాల్లో దాదాపు 160 మందిపై కేసులు పెట్టారన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలకు వెళ్లి గెలిచే దమ్మూ, ధైర్యం లేక చంద్రబాబు టెక్నాలజీని దొడ్డిదారిలో ఉపయోగించుకుంటున్నారన్నారు. టీడీపీకి సంబంధించిన కంపెనీలతో ప్రజల డేటాను లీక్‌ చేసి వైయస్‌ఆర్‌ సీపీ ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఇంత దిగజారుడు రాజకీయాలు చేసే వ్యక్తిని ఇప్పటి వరకు చూడలేదన్నారు. నాలుగున్నరేళ్లుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి, చంద్రబాబు అబద్ధపు హామీలపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ నాయకత్వంలో పోరాటం చేస్తుంటే దాన్ని ఎదుర్కోలేక చంద్రబాబు కుట్రలు చేస్తున్నారన్నారు. ఓట్ల తొలగింపుపై ఎన్నికల కమిషన్‌ డేగ కన్ను వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. 

Back to Top