వైయస్‌ఆర్‌సీపీ రాజ్యసభ  అభ్యర్థులు ఖరారు

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం

ఇద్దరు బీసీ నేతలకు ఎంపీలుగా అవకాశం

సుప్రీం కోర్టు సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డికి ఛాన్స్‌

తాడేపల్లి:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాజ్యసభ నాలుగు ఖాళీలకు సంబంధించి పార్టీ అభ్యర్థులను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఖరారు చేశారు. ఈ మేరకు వివరాలను మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిలు వెల్లడించారు.  వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు. జాతీయ బీసీ ఉద్యమ నేత ఆర్‌.కృష్ణయ్యకు ఎంపీగా అవకాశం ఇచ్చారు. మరో బీసీ నాయకుడు బీద మస్తాన్‌రావు, సుప్రీం కోర్టు సీనియర్‌న్యాయవాది నిరంజన్‌రెడ్డిల పేర్లు సీఎం వైయస్‌ జగన్‌ ఖరారు చేసినట్లు వారు వెల్లడించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యక్ష పోస్టులయినా, నామినేటెడ్‌ అయినా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీది ఒకటే దారి అన్నారు. టీడీపీ నినాదాలకు పరిమితం, మాది చిత్తశుద్ధితో కూడిన ఆచరణ. జనాభా దమాషాకు తగ్గట్టుగా బడుగు, బలహీన వర్గాలకు పదవులు ఇచ్చారని తెలిపారు. మూడేళ్లలో భర్తీ చేసిన అన్ని పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు.  
 

Back to Top