పట్టాభి ..ఖబర్ధార్

 రాష్ట్ర వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ ఆందోళనలు

 
అమ‌రావ‌తి:  ముఖ్యమంత్రిపై టీడీపీ నేత‌ పట్టాభి అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా వైయ‌స్ఆర్ సీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. గత కొన్ని నెలలుగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీ నేత పట్టాభి.. ఇవాళ మరింత దిగజారి సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీఎంను ఏకవచనంతో దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో వైయ‌స్సార్‌సీపీ నిరసనలు చేపట్టారు. నిరసన తెలుపుతున్న వైయ‌స్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారు. 

తిరుపతి: సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ నేతలు.. చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మ ను దహ‌నం చేశారు. తిరుపతి ఆర్టీసి బస్టాండ్ కూడలి లోని గాంధీ విగ్రహం  ముందు చంద్రబాబు నాయుడు, టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి  దిష్టి బొమ్మ ను దహ‌నం చేశారు. ఆధారాలు లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్ధార్ అని హెచ్చరించారు. పట్టాభి తెలుగుదేశం పార్టీలో పెయిడ్‌ ఆర్టిస్ట్ అని విమర్శించారు. నిరసన కార్యక్రమం లో పెద్దఎత్తున వైయ‌స్సార్‌సీపీ నేతలు పాల్గొన్నారు..

విశాఖ: విశాఖపట్నంలో వైయ‌స్సార్‌సీపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించారు. చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పట్టాభి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కర్నూలు: టీడీపీ నేతలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారని హఫీజ్‌ఖాన్‌ మండిపడ్డారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. బాబు డైరెక‌్షన్‌లో ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని హఫీజ్‌ఖాన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top