రైతులారా జాగ్రత్తగా ..చంద్రబాబును నమ్మొద్దు

రాజధాని ప్రాంతంలో హత్యలు చేసి ఆత్మహత్యలుగా చిత్రీకరించే ప్రమాదం

రాజధానిలో మంటలు మండించాలని చంద్రబాబు ఉద్దేశం

ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలపై భువనేశ్వరికి జాలి కలుగలేదు

రాజమండ్రి పుష్కరాల్లో 30 మంది చనిపోతే భువనేశ్వరి ఎక్కడున్నారు?

ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచినా ఆమె చలించలేదు

లోకేష్‌, చంద్రబాబు కొన్న భూములను కాపాడుకునేందుకే ప్రేమ చూపిస్తున్నారు

వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు

తాడేపల్లి: చంద్రబాబు అధికారం కోసం దేనికైనా సిద్ధపడుతారని, రాజధాని ప్రాంతంలో హత్యలు చేసి ..వాటిని ఆత్మహత్యలుగా చిత్రీకరించే ప్రమాదం ఉందని, రైతులు చంద్రబాబు పట్ల జాగ్రత్తగా ఉండాలని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. అమరావతి రైతులపై భువనేశ్వరికి జాలి కలగడం విడ్డూరంగా ఉందన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాకు చంద్రబాబు ఇన్‌సైడర్‌ట్రేడింగ్‌పై రూపొందించిన వీడియోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అమరావతికి సంబంధించిన ఒక వివాదాన్ని పెంచాలనే ఉద్దేశంతో చంద్రబాబు, ఆయన ముద్దుల కుమారుడు, ఆయన దత్తపుత్రుడు సకుంటుంబ సపరివారంగా రాజధానిలో ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్న తాపత్రయం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి తోడుగా కొన్ని పత్రికాధిపతులు కూడా రాజధాని రగిలిపోతుంది..ఉద్యమం ఉవెత్తున ఎగిసిపడుతుందని ప్రపంచానికి చెప్పే తాపత్రయం కనిపిస్తోంది. నిన్న చంద్రబాబు ధర్మపత్ని, ఎన్టీఆర్‌ కుమార్తె నారా భువనేశ్వరి ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా రైతులపై ప్రేమ, జాలి, దయ చూపించారు. అంతేకాకుండా ప్లాటినం గాజును ఉద్యమానికి ఇచ్చారు. ఏమిటి ఇంత జాలి, కరుణ అర్థం కావడం లేదు. ఇంతకుముందు అనేక ఉద్యమాలు జరిగాయి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అనేక మంది ఆకలి చావులు ఉన్నాయి. భువనేశ్వరికి ఇవేవి కనిపించలేదు. గోదావరి పుష్కరాల్లో మీ ఒత్తిడి వల్ల, షూటింగ్‌ వల్ల 30 మంది చనిపోతే వారిని ఆదుకోవాలన్న ఆలోచన భువనేశ్వరికి రాలేదు. సాక్షాత్తు ఆమె కన్న తండ్రి ఎన్‌టీ రామారావును భర్త చంద్రబాబు సీఎం పీఠం కోసం వెన్నుపోటు పొడిస్తే..ఊరూరా తిరిగి నా అల్లుడు దుర్మార్గుడు అని ఎన్టీఆర్‌ ఆవేదన వ్యక్తం చేసినా భువనేశ్వరికి జాలి కలుగలేదు. రాజధాని రైతులపై చాలా ప్రేమ, అభిమానం, జాలి కలిగింది. పాపం చంద్రబాబుకు తొడుక్కోవడానికి వేలికి ఉంగరం లేదు. చేతికి వాచ్‌ లేదు. కానీ భువనేశ్వరి తన చేతికి ఉన్న ప్లాటీనం గాజును ఉద్యమానికి ప్రేమతో ఇచ్చారు. ఎవరి మీద ప్రేమా? రైతుల మీదా ప్రేమా? అమరావతి భూముల మీద ప్రేమా? మీ కుమారుడు బినామీ పేర్లతో కొన్న భూముల మీదా మీ ప్రేమా? లేదా మీ భర్త చంద్రబాబు బినామీ పేర్లతో 4069 ఎకరాల భూమి కొన్నారు..దానిపైనా మీ ప్రేమా?. ఎప్పుడు జాలి కలుగనిది అమరావతి రైతులపైనే జాలి కలిగిందంటే దీని వెనుక కథ ఏమిటో తెలియాల్సిన అవసరం ఉంది.  రాష్ట్రం ఒకప్పుడు భగ్గున మండిపోయింది. రాష్ట్ర విభజన సమయంలో రాజధాని మనకు కాకుండా పోయినప్పుడు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పుడు భువనేశ్వరికి జాలి కలుగలేదు. భళారే ఎంత విచిత్రం. భూములంటే భువనేశ్వరికి ఎంత ప్రేమ?. రాష్ట్ర ప్రజలంటే ప్రేమ లేదు. రైతులంటే ప్రేమ లేదు. కానీ తన కుమారుడు, భర్త కొన్న భూముల కోసం దేనికైనా తెగించేందుకు ఆమె సిద్ధంగా ఉన్నారంటే శభాష్‌..గొప్పగా చెప్పుకోవాలి.  ఇటీవల చంద్రబాబు అంటున్నారు..కరణ్య మరణాలకు అనుమతించాలంటూ రైతుల చేత రాష్ట్రపతికి, ప్రధానికి లేఖలు కూడా రాయించారు. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండండి..చంద్రబాబు కుట్ర స్వభావం కలిగిన వ్యక్తి. అధికారం కోసం ఏమైనా చేస్తారు. రాజధానిలో హత్యలు చేసి..వాటిని ఆత్మహత్యలుగా చిత్రీకరించే ప్రమాదం ఉంది. రైతులారా జాగ్రత్తగా ఉండాలని మనవి చేస్తున్నాను. ఎవరైనా దేనికోసమో చనిపోతే..అమరావతి కోసమే చనిపోయారని ధర్నాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అధికారం కోసం దేనికైనా తెగించే చంద్రబాబును నమ్మొద్దని మనవి చేస్తున్నాను. రాజధాని ప్రాంతంలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించారు. 

 

Back to Top