ఓటమిని తప్పించుకోవడానికే టీడీపీ కుట్రలు

డేటాచోరీ టీడీపీ ప్రభుత్వ తప్పిదమే

పరాకాష్ఠకు చేరిన టీడీపీ అక్రమాలు..

వైయస్‌ఆర్‌సీపీ «అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ

హైదరాబాద్‌:గోప్యంగా ఉండాల్సిన ప్రజల సమాచారం ప్రైవేట్‌ కంపెనీల చేతుల్లో పెట్టడం ప్రభుత్వ తప్పిదమేనని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. టీడీపీ కక్ష కట్టినట్లుగా  వైయస్‌ఆర్‌సీపీపై కేసులు కూడా పెడుతున్నారన్నారు. పోలీసు బూత్‌ స్థాయిలో ఉన్న  వైయస్‌ఆర్‌సీపీ నేతలపై కేసులు పెడుతున్నారన్నారు. 50 లక్షలకు పైగా దొంగ ఓట్లు చేర్పించారని..వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో  కేంద్ర,రాష్ట్ర ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన స్పందించలేదన్నారు. వైయస్‌ఆర్‌సీపీ నేత వైయస్‌ వివేకానందరెడ్డి, పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌ ఓట్లు కూడా తొలగించారంటే రాష్ట్రంలో యంత్రాంగం ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుందన్నారు. ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులు ఫాం–7 పూర్తిచేసే అవకాశం ఉంటుందా అని ప్రశ్నించారు.ప్రతిపక్షానికి  సంబంధించిన ఓట్లు నియోజవర్గాల్లో వేల సంఖ్యలో తొలగిస్తున్నారన్నారు.

రాష్ట్రంలో అధికారులకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోకుండా వైయస్‌ఆర్‌సీపీ నేతలపైనే ఎదురు కేసులు పెడుతున్నారన్నారు. జిల్లాల వారీగా వైయస్‌ఆర్‌సీపీ నేతలను కుట్రపూరితంగా అరెస్ట్‌ చేస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం తన తప్పిదం బయటపడకుండా ఎదురుదాడి చేస్తుందన్నారు. అధికారంలో ఉండి.. యంత్రాంగం అంతా తన చేతుల్లో పెట్టుకుని  కుట్రలు చేస్తున్నారని తెలిపారు.జన్మభూమి కమిటీలు గ్రామాలను శాసిస్తున్నాయని దుయ్యబట్టారు.పెద్ద ఎత్తున 50 లక్షలకు పైగా దొంగ ఓట్లు చేర్పించారన్నారు. అద్భుతంగా పరిపాలించామని ప్రజలను టీడీపీ అడిగే పరిస్థితి లేదని..అందుకే అక్రమ మార్గాల ద్వారా వచ్చే ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వంపై  వ్యతిరేకత తీవ్రంగా ఉందని జాతీయ సర్వేలు సృష్టం చేస్తున్నాయని తెలిపారు.

వైయస్‌ఆర్‌సీపీకి అనుకూలంగా నివేదికలు వస్తున్నాయన్నారు. దీంతో చంద్రబాబు గెలవలేమనే భయంతో కుట్రలకు పాల్పడుతున్నారన్నారు.వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని రాజకీయాల్లో లేకుండా చేయడానికి ఈ నాలుగున్నరేళ్లు టీడీపీ తీవ్రంగా ప్రయత్నించిందన్నారు. అది సాగకపోవడంతో అనేక కుట్రలు పన్నుతున్నారన్నారు. ఓటు అనే కీలక ప్రక్రియను తమ  చేతుల్లోకి తీసుకుని అధికార టీడీపీ  కుట్రలు చేస్తుందన్నారు.రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టి రాష్ట్రానికి అన్యాయం చేశారన్నారు.చివరికి ఓటమి తప్పించుకోవడానికే అడ్డదారులు వెతుకుతున్నారు.

టీడీపీ అక్రమాలు పరాకాష్ఠకు చేరాయని, ఓట్లను గల్లంతు చేసే దుశ్చర్యకు ప్రభుత్వం పూనుకుందన్నారు.దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈలాంటివి జరగలేదన్నారు. టెక్నాలజీ ఉపయోగించుకుని ప్రజల ఓటు అనే ఆ«యుధాన్ని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.బోగస్‌ ఓట్లను చేర్పించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలుచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.అన్ని రకాలుగా కుట్రలు చేయడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తుందన్నారు. నిజంగా టీడీపీ ఓట్లు తొలగించే ప్రయత్నం వైయస్‌ఆర్‌సీపీ చేసి ఉంటే ఇప్పటిదాకా ఎన్నికల కమిషన్‌ ,పోలీస్‌స్టేషన్‌లో ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు.అరాచకాలకు పాల్పడి గెలవడమే లక్ష్యంగా టీడీపీ ముందుకు వెళ్తుందన్నారు. 

తాజా వీడియోలు

Back to Top