వైయ‌స్ఆర్ మాదిరిగానే వైయ‌స్ జ‌గ‌న్  

నెల్లూరు : ముఖ్యమంత్రిగా దివంగత మ‌హానేత డాక్టర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. వైయ‌స్సార్ 11వ వ‌ర్థంతి సందర్భంగా నెల్లూరులోని  గాంధీ బొమ్మ సెంటర్‌లో వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి ఘ‌నంగా  నివాళులు అర్పించారు. వైయ‌స్సార్ ఆశ‌యాల‌ను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి అమ‌లుచేస్తూ జ‌న‌రంజక పాలన అందిస్తున్నారని కొనియాడారు. వైయ‌స్సార్ హయాంలో మాదిరిగానే వైయ‌స్ జ‌గన్ పాల‌న‌లోనూ  వర్షాలు కురుస్తున్నాయని పేర్కొన్నారు. 

నెల్లూరు జిల్లా స‌మ‌గ్రాభివృద్ధికి వైయ‌స్ఆర్‌ కృషి: ఎమ్మెల్యే కాకాణి
దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి నెల్లూరు జిల్లా సమగ్రాభివృద్ధికి ఎంతో కృషి చేశార‌ని వైయ‌స్ఆర్‌సీపీ  జిల్లా అధ్య‌క్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. పార్టీ కార్యాల‌యంలో వైయ‌స్సార్ విగ్ర‌హానికి పూల‌మాల‌లు వేసి ఘ‌నంగా నివాళులర్పించారు.   కృష్ణపట్నం పోర్టుతో పాటు ప్రత్యేక ఆర్థిక మండలి  కూడా వైయ‌స్సార్  చొరవ వల్లే వచ్చాయని వీటితో వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని కొనియాడారు. అనంత‌రం స‌ర్వ‌మ‌త ప్రార్థ‌న‌లు నిర్వ‌హించారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు మొయిల్ల గౌరి స‌హా పార్టీ నేతలు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top