వచ్చే ఎన్నికలను యుద్ధంలా భావించి పని చేయాలి

వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి

సిద్ధం సభకు సర్వం సిద్ధం

ఒంగోలు:  వచ్చే ఎన్నికలను యుద్ధంలా భావించి పార్టీ శ్రేణులు పని చేయాలని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సూచించారు. ఈ నెల 10వ తేదీ నిర్వహించనున్న సిద్ధం సభ ఏర్పాట్లను శనివారం ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిద్ధం సభకు ఆరు పార్లమెంట్‌ ప్రాంతాల నుంచి 43 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు వస్తారన్నారు. భిమిలీలో మొదటి సభ, తరువాత ఏలూరు, ఆ తరువాత రాప్తాడులో సిద్ధం సభలు నిర్వహించామన్నారు. ఈ సభలకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి వైయస్‌ఆర్‌సీపీ సపోర్టు చేస్తూ మిగతా వారితో సమాంతరంగా అభివృద్ధి చెందేలా కార్యక్రమాలు చేపట్టాం. ఈ రోజు రాష్ట్రంలో బీసీలంతా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ వైపు ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో మాకు మద్దతుగా నిలుస్తారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదన్నారు. తప్పకుండా మా టార్గెట్‌ 175కు 175 నియోజకవర్గాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మేం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకుంటామన్నారు. సిద్ధం మహాసభకు వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు వచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. సభలో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సిద్ధం సభ తప్పకుండా విజయవంతం అవుతుందన్నారు. ట్రాన్స్‌ఫోర్టు ఏర్పాట్లు మజ్జి శ్రీనివాసరావు చూస్తున్నారని, సభ ప్రాంగణం ఏర్పాట్లు తలశీల రఘురాం చూస్తున్నారని, ఇలా అందరం కలిసికట్టుగా పని చేస్తూ సిద్ధం సభను విజయవంతం చేస్తామన్నారు.

సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు..
నెల్లూరు పార్లమెంట్‌ సమన్వయకర్తగా తనను నియమించడం పట్ల వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి  పార్టీ అధినేత, సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  కూటమి ఒకవైపు..వైయస్‌ఆర్‌సీపీ మరో వైపు ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలను యుద్ధంలా భావించి పని చేయాలని పార్టీ శ్రేణులకు విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. 175 సీట్లు అనేది ఒక నినాదంలా తీసుకెళ్లాలని సూచించారు. 

 

Back to Top