యాంకర్ గళాన్ని జోడించావా లోకేష్?

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

న్యూఢిల్లీ:  నారా లోకేష్ చేప‌ట్టిన యువ‌గళం పాద‌యాత్ర‌కు స్పంద‌న లేక‌పోవ‌డంతో టీవీ యాంక‌ర్‌తో కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌డం ప‌ట్ల వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన‌కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. 
యువగళంకి స్పందన కరువై, ఎవరూ గాలానికి చిక్కడం లేదనా...యాంకర్ గళాన్ని జోడించాడు లోకేష్! ఎన్నిపగటి కలలుకన్నా, డ్రామాలు వేసినా ప్రయోజనం లేదు బాబూ అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ఈ బాల్య స్మృతుల గోల ఏంటయ్యా చిన్నబాబూ? జనాలను విసిగించడం తప్ప.  చిన్నప్పుడే మెకానిక్కులు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలుగా మెరుపులు మెరిపించి ఉంటే ఆ రంగాలనే ఎంచుకోవాల్సింది. ఎవరు వద్దన్నారు. రాజకీయాల్లో ఓడిపోయి అవమానాల పాలయ్యే బాధ తప్పేదిగదా! చిన్ననాటి చందమామ కథలు ఆపేసి ప్రజలకు ఏం చేస్తారో చెబితే సంతోషిస్తాం అంటూ అంత‌కుముందు విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.
 

Back to Top