నీ సీటు వైయ‌స్ జగన్, ప్ర‌జ‌లు పెట్టిన భిక్షరా... 

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి:  మా తాతలు నేతులు తాగారు- మా మూతులు చూడండని డబ్బా కొట్టుకోవడమేనా? నువ్వు చేసేదేమైనా ఉందా? అంత పోటుగాడివైతే గతంలో నువ్వున్న పార్టీలు నీకు కనీసం టికెట్ కూడా ఎందుకివ్వలేదు? నీ సీటు వైయ‌స్ జగన్ గారు, జనం పెట్టిన భిక్షరా...విగ్గు, పెగ్గు, గబ్బు రాజా! అంటూ వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

బ్రూటస్ కి బొల్లి, విగ్గు, డ్రామోజీ కవల సోదరులు - శకునికి వారసులు! యుగాలు మారినా, తరాలు తరలినా ఆ అంశలు పుడుతూనే ఉంటాయి. సీజర్ లాంటి ఎన్టీఆర్ ను బొల్లి, డ్రామోజీ అంతం చేస్తే... యెల్లో గూటిలో కుర్చొని లాగులు తడుపుకుంటున్నాడు విగ్గురాజు అంటూ విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు.

ప్రజల ఓట్లతో చట్టసభలో అడుగు పెట్టేవారు జనం కోసం పరితపించాలి. నువ్వేంటిరా పెగ్గు? గూట్లోదూరి లాగులు తడుపుకొంటున్నావు? రాత్రిపూట ఢిల్లీలో నాయకులను కలిసి కాపాడంటూ కలవరిస్తున్నావు. ఆత్మన్యూనతా భావంతో అనుక్షణం చస్తున్న నువ్వు  ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అంటూ విజ‌య‌సాయిరెడ్డి ఉద‌యం ఇంకో ట్వీట్ చేశారు.

Back to Top