రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి చంద్రం భారీ స్కెచ్చే వేశాడు

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

తాడేప‌ల్లి:  ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు తీరును వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎండ‌గ‌ట్టారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడానికి చంద్రం భారీ స్కెచ్చే వేశాడు. అమరావతిని అంగీకరించాలంటూ ఉత్తరాంధ్రలో ఘర్షణలు లేపాలని చూస్తే, ప్లాన్ ఫ్లాప్ అయింది. కర్నూలు వెళ్లి తనే రెచ్చగొట్టే యత్నం చేసాడు. మీరు కడుపు మాడ్చుకుని మాకు కమ్మ’ని భోజనం వడ్డించండి అన్నట్టుంది చంద్రం  వాలకం అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

జగన్నాథ రథ చక్రాల కింది నుజ్జునుజ్జే
డ్రామోజీ! నీ ఫిలిం సిటీ పుట్ట పగులుతుంది. అణాకాణికి నువ్వు కొనుగోలు చేసిన భూములను రైతులు తిరగబడి స్వాధీనం చేసుకునే రోజు ఎంతో దూరం లేదు. రాహు కాలం మొదలైంది. జగన్నాథ రథ చక్రాల కింది నుజ్జునుజ్జయి పోవడం ఖాయం. గాలికి కొమ్మలు కదిలినా నావల్లే అనే భ్రమల్లో బతికావు ఇన్నాళ్లు అంటూ మ‌రో ట్వీట్ చేశారు.

ప్ర‌గాఢ సానుభూతి..
ప్రముఖ రాజకీయవిశ్లేషకుడు, సీనియర్ జర్నలిస్ట్ ఇలపావులూరి మురళీమోహన్ రావు గారి ఆకస్మిక మరణం తీవ్రదిగ్భ్రాంతికి గురిచేసింది. పత్రికారంగానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివి. మురళీమోహన్ రావు గారి ఆత్మకు స‌ద్గతి చేకూరాలని ప్రార్థిస్తూ.. వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అంటూ తాజాగా విజ‌య‌సాయిరెడ్డి మ‌రో ట్వీట్ చేశారు. 

Back to Top