న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషన్‌తో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల బృందం భేటీ అయ్యింది. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఎన్నికల కమిషన్‌ను వైయస్‌ఆర్ సీపీ ఎంపీలు కలిశారు. ఓట్ల తొలగింపుపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారంపై సాక్ష్యాధారాలతో సహా ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అదే విధంగా టీడీపీ హయాంలో చేర్పించిన దొంగ ఓట్లపై ఫిర్యాదు చేశారు. 2014–19 మధ్య దాదాపు 60 లక్షల దొంగ ఓట్లను టీడీపీ చేర్పించింది. దాదాపు 30 లక్షల ఓట్లను 2019లోనే వైయస్‌ఆర్ సీపీ ఆ దొంగ ఓట్లను తీయించింది.