ఈనెల 28న సీఈసీతో వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీల స‌మావేశం

న్యూఢిల్లీ: ఈనెల 28వ తేదీన వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీల బృందం సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ (సీఈసీ)తో భేటీ కానుంది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలకు కేంద్ర ఎన్నికల సంఘం అపాయింట్‌మెంట్‌ ఇచ్చింది. ఈనెల 28న సాయంత్రం 4.30 గంటలకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి నేతృత్వంలో ఎంపీల బృందం సీఈసీతో స‌మావేశం కానుంది. ఓటర్ల జాబితాపై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. అదే విధంగా టీడీపీ హ‌యాంలో చేర్చిన‌ దొంగ ఓట్లపై ఫిర్యాదు చేయనున్నారు.

Back to Top