సీఎం వైయస్‌ జగన్‌కు సంక్షేమం..అభివృద్ధి రెండు కళ్లు

వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి
 

వైయస్‌ఆర్‌ జిల్లా:  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా భావించారని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.  బద్వేల్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో సోమవారం వైయస్‌ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అత్యంత ప్రతికూల పరిస్థితులు ఉన్నా..రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నా..మరో వైపు కోవిడ్‌ను ఎదుర్కోవడానికి వేల కోట్ల వ్యయం అయినా కూడా..ఈ కారణాలేవి చెప్పకుండా , చెప్పిన ప్రతి హామీని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నెరవేర్చుతున్నారు. క్రెడిబులిటీ ఉన్న నాయకుడు మన సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి.  ఒక వైపు సంక్షేమ‌ కార్యక్రమాలు అమలు చేస్తూనే..మరో  వైపు అభివృద్ధి అన్నట్లుగా రెండు క‌ళ్లులా సంక్షేమం, అభివృద్ధి ప‌నులు పెద్ద‌ ఎత్తున చేపడుతున్నారు. బద్వేల్‌లో ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. 2014 నుంచి 2019 వరకు ఏనాడైనా బ్రహ్మంసాగర్‌కు 5 టీంసీల నీరు రాలేదు. 0 నుంచి 18 కిలోమీటర్ల వరకు కాల్వను బాగు చేయించాలని ఎన్నిసార్లు కోరినా కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. కేవలం 3 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చేది. ఈ రకంగా మనకు నష్టం జరిగిపోయింది. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చాక వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. 18 కిలోమీటర్ల పనులకు రూ.300 కోట్లు మంజూరు చేయించి ..దాదాపు 85 శాతం పనులు వైయస్‌ జగన్‌ చేయించారు. మనకు కనీసం 2,500 క్యూసెక్కుల నీరైనా వస్తోంది. ఆరు మాసాల పాటు కుందు నది పారుతోంది. కుందు నది నుంచి బ్రహ్మంసాగర్‌కు ఎత్తిపోతల పథకాన్ని సీఎం వైయస్‌ జగన్‌ మంజూరు చేశారు. టెండర్లు కూడా ఖరారు అయ్యాయి. ఏడాదిలోగా ఈ ఎత్తిపోతల పనులు పూర్తి అవుతాయని ఎంపీ అవినాస్‌రెడ్డి అన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top