బాబూ..కుప్పం అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి గెలవండి  

 విజయ సాయిరెడ్డి ట్వీట్‌ 
 

అమరావతి: 'ప్రజలు మళ్లీ తననే  కోరుకుంటున్నారని కలువరిస్తున్న చంద్రబాబు కుప్పం అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి గెలవాలని వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి సూచించారు.  ప్రజలంటే కుల మీడియా అధిపతులు, మీ బంధుగణం, మోచేతి నీళ్లు తాగే చెంచాలు కాదు చంద్రబాబు గారూ. 13 జిల్లాల్లోని ఐదు కోట్ల మందిని ప్రజలు అని అంటారని పేర్కొన్నారు.  కుప్పం నుంచి మళ్లీ మీరు గెలిస్తే..నిజంగానే ప్రజలు మిమ్మల్ని కలవరిస్తున్నారని భావిస్తారంతా' అని ట్వీట్ చేశారు. 

నాలుగు నెలల్లోనే సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి  80 శాతం హామీలను నెరవేర్చారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.  'వంశ పారంపర్యం అర్చకత్వానికి ఆమోదం తెలపడం ద్వారా ఆలయాలపైన ఆధారపడి జీవిస్తున్న వేలాది అర్చక కుటుంబాలకు వైయస్‌ జగన్ భరోసా కల్పించారని తెలిపారు. గతంలో కూల్చేసిన ఆలయాలు, ప్రార్థనా స్థలాలన్నిటినీ పునర్నిర్మించే పనులు త్వరలోనే ప్రారంభమవుతాయని చెప్పారు.  

 

Read Also: ఏపీపీఎస్సీ సభ్యులుగా సుధాకర్‌రెడ్డి, సలాంబాబు 

Back to Top