చంద్రబాబు, కేఏపాల్‌ లాలూచీ రాజకీయాలు

ఏపీలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

పోలీసు వాహనాల్లో టీడీపీ డబ్బులు తరలిస్తోంది..

చంద్రబాబు అధికార దుర్వినియోగంపై ఈసీకి వైయస్‌ఆర్‌సీపీ  ఫిర్యాదు 

ఢిల్లీ: చంద్రబాబుకు కేఏ పాల్‌ లాలూచీ పడి అమ్ముడుపోయారని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. కేఏ పాల్‌ తరపున నిలబడిన అభ్యర్థుల పేర్లు వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థుల పేర్లతో పోలి ఉన్నాయని తెలిపారు. ఢిల్లీలో ఈసీ ఫుల్‌ కమిషన్‌ను వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేతలు  ఎంపీ విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి,ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు,బొత్స సత్యనారాయణ కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. డబ్బులకు అమ్ముడుకుపోయి కేఎల్‌ పాల్‌ దిగజారుడు రాజకీయాలు నడుపుతున్నారని «ధ్వజమెత్తారు. ప్రజాశాంతి పార్టీ  హెలికాప్టర్‌ సింబల్‌ను మార్చాలని ఈసీని కోరినట్లు తెలిపారు.ప్రజాశాంతి పార్టీ కండువా కలర్స్‌ కూడా మార్చాలని కోరామన్నారు.

ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ వ్యవహారంలో వివాదస్పద జీవో అంశాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు పోలీసు వాహనాల్లో డబ్బును నియోజకవర్గాలకు చేరుస్తున్నారని ఫిర్యాదు చేశారు.ఘట్టమనేని శ్రీనివాస్,యోగానంద్,విక్రాంత్‌ పాటిక్,కోయా ప్రవీణ్‌తో పాటు మరి కొంతమంది ఐపీఎస్‌లు సీఎం కనుసన్నల్లో పనిచేస్తున్నారన్నారు. ఓటర్ల ప్రలోభపెట్టే విధంగా పసుపు–కుంకుమ పథకం కింద నేరుగా మహిళల ఖాతాల్లోకి డబ్బు జమ వైనంపై కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు. ఏపీలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ను బదిలీ చేయకుండా జీవో నెంబర్‌ 720 తీసుకురావడాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్ళామన్నారు.డీజీపీ ఠాకూర్‌ సహా కొందరు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, ఏపీలో ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చూడాలని కోరినట్లు తెలిపారు.

డీజీపీ ఠాకూర్‌ 35 కోట్లు అమరావతి నుంచి ప్రకాశం జిల్లాకు తరలించారన్నారు. మా ఆరోపణల్లో తప్పుంటే మాపై కేసులు పెట్టొచ్చన్నారు. ఏపీ డీజీపీ ఠాకూర్‌ను ఎన్నికల విధుల నుంచి తొలగించాలని  వినతించామన్నారు.ఈసీ ఆదేశాలను ఉల్లంఘించేందుకు చీఫ్‌ సెక్రటరీతో చంద్రబాబు చర్చలు జరిపారన్నారు.ఈసీని భేఖాతారు చేసి రాజ్యాంగానికి చంద్రబాబు తూట్లు పొడిచారన్నారు.రాష్ట్రంలో చంద్రబాబు రాజ్యాంగ సంక్షోభం సృష్టించారన్నారు.మేం ఇచ్చిన వినతిపత్రంలోని చాలా అంశాలు ఈసీ ఆమోదించలేదన్నారు.ఈసీ ఉత్తర్వులతో మేం సంతృప్తి చెందలేదని తెలిపారు.చంద్రబాబు ఎన్నికల్లో గెలవడానికి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాని చంద్రబాబు అధికార దుర్వినియోగంపై ఫిర్యాదు చేశామన్నారు.

Back to Top