చంద్ర‌బాబును చూస్తే జాలేస్తోంది..!

వైయ‌స్ఆర్ సీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు, నెల్లూరు ఎంపీ అభ్య‌ర్థి విజ‌య‌సాయిరెడ్డి

నెల్లూరు: చంద్ర‌బాబు ప‌రిస్థితిని చూస్తే జాలేస్తోంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యులు, నెల్లూరు ఎంపీ అభ్య‌ర్థి విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. 2019 ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో పోల్చుతూ.. ఈసారి ఎన్నిక‌ల్లో టీడీపీ గెలుచుకునే సీట్ల విష‌యంలో చంద్ర‌బాబుకు చుర‌క‌లు అంటిస్తూ ట్వీట్ చేశారు.

`చంద్రబాబూ..! పోయినసారి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను కొన్నావు. 2019 ఎన్నికలలో (మే 23న జరిగిన కౌంటింగ్‌లో) నీకు వచ్చింది 23 స్థానాలే.
ఈసారి మా వాళ్ళను నలుగురిను ( కోటంరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి) కొన్నావు. జూన్‌ 4న కౌంటింగ్ జరగబోతున్నది. 
ఈసారి ఎన్ని సీట్లకు పరిమితం కాబోతున్నావో ఈపాటికి నీకు అర్థమై ఉంటుంది కదా చంద్రబాబూ?
ఈ లెక్కన నువ్వు నాలుగు స్థానాలకే  పరిమితం కాబోతున్నావని తెలిసి...నీ మీద జాలేస్తోంది!`

Back to Top