‘కెలికి మరీ తిట్టించుకోవడం చంద్రబాబుకు అలవాటే’

తాడేపల్లి: చంద్రబాబుపై వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ’కెలికి మరీ తిట్టించుకోవడం బాబుకు అలవాటే. అధికారంలో ఉన్నన్నాళ్లు అశోక్‌ గజపతిని ముందు పెట్టి మాన్సాస్‌ ట్రస్టును సర్వనాశనం చేశాడు. ఏ సంబంధం లేని కుటుంబరావు, ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ వీసీ ఐవీ రావులను సభ్యులుగా నియమించినప్పుడే అర్థమైంది. దాన్ని కేకు ముక్కలా నాకేస్తాడని’ అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. 
 

Back to Top