దళిత సంక్షేమంపై నాతో చర్చకు వచ్చే దమ్ము ఉందా..?

బాబు, రామోజీ, లోకేష్, పవన్‌లకు వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ నందిగం సురేష్‌ సవాల్‌

ఎస్సీలను చంద్రబాబు ఎంతగా అవమానించాడో నేను నిరూపిస్తా..

సీఎం వైయస్‌ జగన్‌ ఎస్సీలకు చేసిన మేలును వివరిస్తా.. 

బాబును నమ్ముకొని బాగుపడిన ఒక్క ఎస్సీ కుటుంబానైనా చూపించగలరా..?

దళితులను చీమలు, దోమలు, కప్పలతో నాటి మంత్రి పుల్లారావు పోల్చాడు

ఎన్నికలు వస్తున్నాయని ఎస్సీలపై చంద్రబాబు, లోకేష్, రామోజీల కపట ప్రేమ

ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం, పీడ, చీడ చంద్రబాబు

2024 తరువాత ఆ చీడ, పీడ కూడా పూర్తిగా తొలగిపోతుంది

ఫిల్మ్‌ సిటీలోని అసైన్డ్‌ భూములను ఎస్సీలకు పంచే దమ్ము రామోజీకి ఉందా..?

పేదలు అమరావతిలో ఉంటే మురికికూపాలుగా మారుతాయన్న నీచుడు చంద్రబాబు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు మేలు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయించుకున్నారు

దొంగల ముఠా ఎన్ని కుట్రలు పన్నినా 2024లో వైయస్‌ జగనే మళ్లీ సీఎం

తాడేపల్లి: ‘‘దళితులకు వైయస్‌ జగన్‌ హయాంలో జరుగుతున్న మేలు, చంద్రబాబు హయాంలో జరిగిన కీడు గురించి చర్చకు చంద్రబాబు, లోకేష్, పవన్‌ కల్యాణ్, రామోజీరావు, ఏబీఎన్‌ రాధాకృష్ణ ఎవరు వచ్చినా సరే చర్చకు నేను సిద్ధం. సీఎం వైయస్‌ జగన్‌ మేలు చేశారని నిరూపిస్తా.. లేదు చంద్రబాబు చేశాడని మీరు నిరూపించే దమ్ముంటే చర్చకు రండి’’ అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ నందిగం సురేష్‌ సవాల్‌ విసిరారు. అమరావతిలో సీఆర్‌డీఏ పరిధిలో ఎస్సీలను చంద్రబాబు ఎంతగా అవమానించాడో తాను నిరూపిస్తానన్నారు. రామోజీరావుకు సిగ్గుంటే, కడుపుకు అన్నమే తింటే, ఎస్సీల మీద ప్రేమ ఉంటే రామోజీ ఫిల్మ్‌ సిటీలో అసైన్డ్‌ భూముల లెక్క బయటకు తీసి పంచాలన్నారు. కాటికి కాళ్లుజాపిన రామోజీరావు, చంద్రబాబుకు, అరమైండ్‌ లోకేష్‌కు ఎస్సీల మీద కొత్తగా ప్రేమ పుట్టుకురావడంతో రాష్ట్ర ప్రజలంతా ఇదెక్కడి చోద్యం అని ఆశ్చర్యపోతున్నారన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ నందిగం సురేష్‌ మీడియాతో మాట్లాడారు. ఈనాడు రామోజీరావు రాతలపై తీవ్రంగా మండిపడ్డారు. 

‘‘చంద్రబాబు ఒకపక్క ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని మాట్లాడుతుంటే.. సీఎం వైయస్‌ జగన్‌ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని మాట్లాడుతున్నారు. కుల వివక్ష ఎవరి దగ్గర ఉందో ప్రజలకు అర్థం అవుతుంది. చంద్రబాబును నమ్ముకున్న దళితుడు ఇవాళ ఫలానా స్థాయిలో ఉన్నాడని చెప్పగలరా..? ఈ రాష్ట్ర ప్రజలతో సహా సీఎం వైయస్‌ జగన్‌ను నమ్ముకొని మోసపోయిన ఓ వ్యక్తిని ఒకరిని చూపించగలరా..? 

గతంలో సీఆర్‌డీఏ ప్రాంతంలో అసైన్డ్‌ భూములు చంద్రబాబు ఏ విధంగా తీసుకున్నారో చర్చకు నేను సిద్ధం.. దమ్ముంటే చర్చకు చంద్రబాబు రాగలడా..? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబును నాతో చర్చకు వస్తే ఇదే సీఆర్‌డీఏ ప్రాంతంలో ఎస్సీలను ఏ విధంగా అవమానించాడో, ఎంత దారుణంగా చూశాడో చెబుతాను. తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు పట్టువస్త్రాలు ఇచ్చి, దళితులు బయటకు రాకుండా పోలీసులను కాపాలా పెట్టిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తికి ఈరోజు ఎస్సీలపై ప్రేమపుట్టుకొచ్చింది. ఎందుకంటే ఎస్సీలంతా సీఎం వైయస్‌ జగన్‌ వెంట ఉన్నారు.. ఏదో రకంగా గందరగోళం సృష్టించి, ఆ గొడవలను వైయస్‌ఆర్‌ సీపీకి అంటగట్టాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నాడు..

కాటికి కాళ్లుజాపుతున్న రామోజీరావు, చంద్రబాబుకు, అరమైండ్‌ లోకేష్‌కు ఎస్సీల మీద కొత్తగా ప్రేమ పుట్టుకురావడంతో రాష్ట్ర ప్రజలంతా ఇదెక్కడి చోద్యం అని ఆశ్చర్యపోతున్నారు. 

సీఎం వైయస్‌ జగన్‌ రాష్ట్రంలో పదవులు, మహిళలు రక్షణ, విద్య, వైద్యం.. ఇలా అన్ని రకాలుగా మేలు చేస్తున్నారు. దళితులకు ఇంగ్లిష్‌ మీడియం చదువులు వద్దని కోర్టులకు వెళ్లి అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు. దళితులకు సొంత ఇల్లు ఉండకూడదు, ఉన్నత చదువులు చదువుకోకూడదు, అణగారిన జాతులు అభివృద్ధి చెందకూడదని రామోజీరావు, చంద్రబాబు ఆలోచనలు చేస్తున్నారు. ఈనాడు రాతలు చూస్తే బాధగా ఉంది. 

చంద్రబాబు ఏది చెబితే అది రాసుకోవడం రామోజీరావు వృత్తి. ఈనాడు పత్రిక తెలుగుదేశం పార్టీ కరపత్రం. చంద్రబాబుకు మరోసారి సవాల్‌ విసురుతున్నా.. దమ్మూ, ధైర్యం ఉంటే చర్చకు సిద్ధమా..? అమరావతిలో, సీఆర్‌డీఏ ప్రాంతంలో ఎస్సీలను ఎంతగా అవమానించాడో నిరూపిస్తా.. దమ్ముంటే చర్చకు రా.. లేకపోతే చేతగానివాడిని అనుకొని సర్దుకో.. పనికిమాలిన వాడిలా పిచ్చిరాతలు రాయించి, రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని గందరగోళం సృష్టించాలని చూస్తే రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. 

రామోజీరావుకు సిగ్గుంటే, కడుపుకు అన్నమే తింటే రామోజీ ఫిల్మ్‌ సిటీలో అసైన్డ్‌ భూములు బయటకు తీసి పంచండి. అమరావతి ప్రాంతంలో ఎస్సీలను భయపెట్టి అసైన్డ్‌ భూములను చౌకగా చంద్రబాబు దాయాదులు కొనుగోలు చేసి ఒరిజినల్‌ పత్రాలన్నీ వారి దగ్గర దాచుకొని ఇప్పటికీ బయటపెట్టలేదు. 

సీఎం వైయస్‌ జగన్‌ అమరావతి ప్రాంతంలో పేదలు ఉండేందుకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. పేదలు అమరావతిలో ఉంటే మురికికూపాలుగా మారుతాయని మాట్లాడిన నీచుడు చంద్రబాబు. రామోజీరావు రాసిన రాతల్లో నిజాలు ఉంటే బహిరంగ చర్చకు సిద్ధం. చంద్రబాబు, లోకేష్, పవన్‌ కల్యాణ్‌ ఎవరు వచ్చినా సరే చర్చకు నేను కూర్చుంటా.. సీఎం వైయస్‌ జగన్‌ ఎస్సీలకు మేలు చేశారని నేను నిరూపిస్తా.. లేదు చంద్రబాబు చేశాడని మీరు నిరూపించే దమ్ముంటే చర్చకు రండి. సిగ్గు, శరం, ఆత్మాభిమానం చంపుకొని రామోజీరావు రాతలు రాస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు వీరంతా దొంగల ముఠాగా ఏర్పడి ప్రవర్తిస్తున్నారు. 

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలకు మేలు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయించుకున్నారు. వారి బాగుకోసం కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు. చంద్రబాబు ఒక సామాజిక వర్గాన్ని పట్టుకొని రియల్‌ ఎస్టేట్‌ దందా చేసి రాష్ట్రాన్ని దోచుకోవాలని చూశాడు. తన సామాజిక వర్గానికి ఎక్కడెక్కడ ఎంత లబ్ధి చేకూర్చాడో బయటకు తీసే దమ్ముందా..?  

రాజధాని ప్రాంతం సీఆర్‌డీఏలో అసైన్డ్‌ భూములు పూలింగ్‌కు తీసుకునేటప్పుడు మంత్రిగా ఉన్న పుల్లారావు ఎస్సీలను చీమలు, దోమలు, కప్పలతో పోల్చాడు. ‘మా అసైన్డ్‌ భూములు తీసుకొని మాకూ ప్యాకేజీ ఇస్తారా అని ఎస్సీలు అడిగితే.. అవి వూరికే ఇచ్చినవి వూరికే పోతాయి.. రోడ్డు వేసేటప్పుడు చీమలు, దోమలు, కప్పలు సర్వసాధారణంగా చనిపోతాయి.. మీకోసం రాజధాని ఆపే ప్రసక్తి లేదు’ అని మంత్రిగా ఉన్న పుల్లారావు మాట్లాడాడు. ఎస్సీలను చీమలు, దోమలు, కప్పలతో మంత్రి పుల్లారావు ఆరోజున పోల్చాడు. ఇలాంటి వ్యక్తులు ఎస్సీల బాగు గురించి మాట్లాడుతారా..? 

చంద్రబాబు ఈ రాష్ట్రానికి దరిద్రం, పీడ, చీడ, 2024 తరువాత ఆ చీడ, పీడ కూడా పూర్తిగా తొలగిపోతుంది.. రాష్ట్ర ప్రజలు సస్యశ్యామలంగా ఉంటారు. మళ్లీ ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ ఉంటారు. దొంగలముఠా అంతా కలిసి ఎన్ని ఏడుపులు ఏడ్చినా ఈ రాష్ట్రానికి మళ్లీ వైయస్‌ జగనే సీఎం’’ అని ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు.  
 

Back to Top