తిరుమల: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. ఎంపీ మార్గాని భరత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడిని కోరుకున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తనలాంటి ఎంతోమంది యువకులను రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్నారన్నారు. సీఎం వైయస్ జగన్ పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు.