టీడీపీలోని ప్రతీ నాయకుడు దుశ్శాసనుడే

నారీ సంకల్ప దీక్ష చేసే అర్హత తెలుగుదేశం పార్టీకి లేదు

మహిళల పట్ల తెలుగుదేశం పార్టీకి మమకారం, ప్రేమ లేదు

చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్ర అంతా మహిళలను మోసం చేయడమే

టీడీపీ నాయకులకు మెదడు తలలో ఉందా..? మోకాళ్లో ఉందా..?

ప్రజల దృష్టి మళ్లించడానికి దుర్యోధనుడిలా బాబు డైరెక్షన్‌..

మహిళాసాధికారత దిశగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అడుగులు

వైయస్‌ జగన్‌ ప్రభుత్వంపై మహిళల ఆదరాభిమానాలు చూసి ఓర్వలేక బాబు కుట్ర రాజకీయాలు

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత

తాడేపల్లి: మహిళలను అవమానపరుస్తూ, అగౌరవపరుస్తూ, లైంగిక వేధింపులకు గురిచేసే తెలుగుదేశం పార్టీ నాయకులకు నారీ సంకల్ప దీక్ష చేసే అర్హత లేదని, తెలుగుదేశం పార్టీలోని ప్రతి నాయకుడు దుశ్శాసనుడేనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ పోతుల సునీత ధ్వజమెత్తారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి చంద్రబాబు వేసిన మాస్టర్‌ ప్లాన్‌లో భాగమే నారీ సంకల్ప దీక్ష అని, టీడీపీది నారీ సంకల్ప దీక్ష కాదు.. దుసంకల్ప దీక్ష అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు దుర్యోధనుడిలా డైరెక్షన్‌ ఇస్తుంటే.. ఆయన తనయుడు ఉత్తర కుమారుడిగా మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేస్తున్నాడని మండిపడ్డారు. లోకేష్‌ బాగోతాలు, స్విమ్మింగ్‌ పూల్‌ ఫొటోలు.. మహిళల పట్ల వారికి ఉన్న గౌరవం ఏమిటో ప్రజలకు తెలిసిపోతుందని నారీ సంకల్ప దీక్ష పేరుతో డ్రామా ఆడుతున్నారని ఎమ్మెల్సీ పోతుల సునీత ధ్వజమెత్తారు. 

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ పోతుల సునీత విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళల పట్ల తెలుగుదేశం పార్టీకి మమకారం, ప్రేమ లేదని, మహిళలను మోసం చేయడమే టీడీపీ నైజమన్నారు. 40 సంవత్సరాల చంద్రబాబు రాజకీయ చరిత్ర అంతా మహిళలను మోసం చేయడమేనన్నారు. మహిళలను వేధించే టీడీపీకి దీక్ష చేసే నైతిక హక్కు లేదన్నారు. 

తన పాలనలో మహిళల మన్ననలు పొందలేకపోయాననే చంద్రబాబు బాధంతా అని, 2014లో మహిళలకు ఇచ్చిన ఏ వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేదన్నారు. డ్వాక్రా మహిళలను రుణాలు మాఫీ చేస్తానని చెప్పి ఓట్లు వేయించుకొని మోసం చేశాడని ధ్వజమెత్తారు. 1995 నుంచి 2004 వరకు, 2014–19 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు.. మహిళల కోసం గొప్ప పథకం అమలు చేశామని ధైర్యంగా చెప్పమనండి అని నిలదీశారు. మహిళలకు చంద్రబాబు చేసిందేమీ లేదని, ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయాలనుకుంటే.. ఈ రాష్ట్రం చెల్లడన్నారు.
5 సంవత్సరాలు డ్వాక్రా మహిళలను మోసం చేసి.. ఎన్నికల సమయంలో పసుపు కుంకుమ పేరుతో ఓట్ల కోసం మహిళలను మోసం చేశాడన్నారు. సీఎం కుర్చీ కోసం బాబు అనేక అబద్ధాలు చెబుతాడని ప్రజలందరికీ తెలుసన్నారు.

వైయస్‌ జగన్‌ దేశంలోనే ఒక అత్యున్నతమైన ముఖ్యమంత్రిగా మహిళల ఆర్థికాభివృద్ధి కోసం కృషిచేస్తున్నారన్నారు. రాజకీయాల్లో కూడా మహిళలకు అనేక పదవులు ఇచ్చారని ఎమ్మెల్సీ పోతుల సునీత గుర్తుచేశారు. నామినేటెడ్‌ పదవులు, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్లు, స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కేటాయిస్తూ ఏకంగా చట్టం తీసుకువచ్చారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా అమ్మఒడి లాంటి పథకం మన రాష్ట్రంలో అమలవుతుందన్నారు. 31 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలు, నాడు–నేడు, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం వంటి పథకాలతో మహిళల ఆర్థికాభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పనిచేస్తున్నారన్నారు. 21వ శతాబ్దపు మహిళ ఆంధ్రప్రదేశ్‌ నుంచి అవతరించేలా సీఎం వైయస్‌ జగన్‌ కృషిచేస్తున్నారని ఎమ్మెల్సీ పోతుల సునీత చెప్పారు. 

సీఎం వైయస్‌ జగన్‌ పట్ల రాష్ట్ర మహిళల ఆదరణ, అభిమానం చూసి ఓర్వలేక చంద్రబాబు కడుపుమంటతో కుట్ర, నీచ రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు.  గత టీడీపీ పాలనలో చంద్రబాబు అరాచకాలు, దుర్మార్గాలు తాను ప్రత్యక్షంగా చూశానని ఎమ్మెల్సీ పోతుల సునీత చెప్పారు. రిషితేశ్వరి అనే యువతి ఆత్మహత్య చేసుకొని చనిపోతే బాబు ప్రభుత్వంలో ఆదుకోలేని పరిస్థితి లేదన్నారు. గత ప్రభుత్వం సెక్స్‌వల్‌ నేరాల మీద పోలీసులు దర్యాప్తు చేసింది 14.5 శాతం అయితే.. వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో 93 శాతం కేసుల్లో విచారణ జరుగుతోందన్నారు. గత ప్రభుత్వంలో 2014–19లో అత్యాచారం, మర్డర్‌ కేసుల్లో దర్యాప్తునకు సగటున 318 రోజులు పడితే.. వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో 42 రోజుల్లో దర్యాప్తు పూర్తవుతుందని, మహిళా రక్షణకు సీఎం వైయస్‌ జగన్‌ ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చన్నారు. దేశంలో ఎక్కడా లేని ఇధంగా మహిళలు, యువతుల రక్షణకోసం దిశ చట్టాన్ని చేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దన్నారు. 

తెలుగుదేశం పార్టీ నాయకులకు మెదడు తలలో ఉందా..? మోకాళ్లో ఉందా..? తెలియకుండా మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. నీచ రాజకీయాలు చేస్తూ వైయస్‌ఆర్‌ సీపీపై బురదజల్లాలనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ దుర్మార్గాలు ప్రజలు గుర్తిస్తున్నారు కాబట్టే ఇటీవల జరిగిన S ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు చెంపదెబ్బ కొట్టారన్నారు. మహిళలను వేధింపులకు గురిచేసే టీడీపీ నాయకులకు నారీ సంకల్ప దీక్ష చేసే నైతిక హక్కు లేదన్నారు.  
 

Back to Top