ఎమ్మెల్సీ అభ్యర్థులకు బీ ఫామ్‌లు ఇవ్వనున్న సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి:  వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున శాసస మండలికి పోటీ చేస్తున్న అభ్యర్థులకు సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బీ ఫామ్‌లు ఇవ్వనున్నారు.  రాష్ట్రంలో ఆరు స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. ఐదు సాధారణ ఖాళీలు, ఒక స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. ఇందుకోసం వైయస్‌ఆర్‌సీపీ తరఫున ఆరుగురు అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు. దివంగత ఎమ్మెల్సీ చెల్లా రామకృష్ణారెడ్డి స్థానంలో ఆయన కుమారుడు చల్లా భగీరథరెడ్డి, దివంగత ఎంపీ దుర్గా ప్రసాద్‌ కుమారుడు బల్లి కల్యాణ్‌ చక్రవర్తి, దువ్వాడ శ్రీనివాస్, సీ.రామచంద్రయ్య, మహమ్మద్‌ ఇక్బాల్, కరీమున్నిసాలను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. వీరికి సీఎం వైయస్‌ జగన్‌ చేతుల  మీదుగా బీ ఫామ్‌లు అందజేయనున్నారు. కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ అభ్యర్థులు సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు.
 

Back to Top