చంద్రబాబు ఇంట్లో మహిళలు లేరా?

డీజీపీకి వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేల ఫిర్యాదు

మహిళలపై అసభ్యకరంగా పోస్టింగ్‌లు

ఎమ్మెల్యే శ్రీదేవి

మంగళగిరి: మహిళలపై టీడీపీ నేతలు అసభ్యకరంగా పోస్టింగ్‌లు పెడుతున్నారని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు. చంద్రబాబు ఇంట్లో మహిళలు లేరా అని ఆమె ప్రశ్నించారు. టీడీపీ సోషల్‌మీడియాపై డీజీపీ గౌతం సవాంగ్‌కు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. అనంతరం శ్రీదేవి మాట్లాడుతూ..ఎమ్మెల్యే అయిన తనపైనే టీడీపీ వాళ్లు దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫెయిడ్‌ ఆర్టిస్టులతో మంత్రులను తిట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 వేల మంది వాలంటీర్లతో సోషయాలో విష ప్రచారం చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం వైయస్‌ జగన్‌ కుటుంబంపై సోషల్‌ మీడియాలో టీడీపీ విష ప్రచారం చేస్తుందని డీజీపీకి ఫిర్యాదు చేశారు.చంద్రబాబుకు ధైర్యం ఉంటే చర్చకు రావాలని సవాలు విసిరారు.అసభ్య పోస్టింగులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. హైదరాబాద్‌ ఎన్‌బీకే కార్యాలయం వేదికగా ప్రభుత్వంపై కుట్ర జరుగుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు ఆకృత్యాలు చూసి జనం సిగ్గుపడుతున్నారని ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు విమర్శించారు. ఓడినా చంద్రబాబు తీరు మారలేదని ఎమ్మెల్యే జోగి రమేష్‌ మండిపడ్డారు. సమాజం తలదించుకునేలా సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు చేయిస్తున్నారు.చంద్రబాబు పెట్టిన మానసిక క్షోభతోనే ఎన్టీఆర్‌, కోడెల లాంటి వారు చనిపోయారన్నారు.

తాజా ఫోటోలు

Back to Top