రాజధాని పేరుతో రాజకీయాలు మానుకోవాలి

చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారు

ప్రజలు తగిన బుద్ధి చెప్పినా చంద్రబాబు తీరులో మార్పు రావడం లేదు

గ్రాఫిక్స్‌తో అమరావతి ప్రజలను బాబు మోసం చేశారు

ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబు అమరావతికి పారిపోయి వచ్చారు

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి

తాడేపల్లి:చంద్రబాబు రాజధాని పేరుతో చేస్తున్న రాజకీయాలు మానుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి సూచించారు. రాజధాని ప్రాంత ప్రజలు ఎన్నికల్లో టీడీపీకి సరైన తీర్పు ఇచ్చినా చంద్రబాబు తీరులో మార్పు రావడం లేదన్నారు. మంగళవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీదేవి మీడియాతో మాట్లాడారు. అమరావతిపై దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, చంద్రబాబు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. నారా లోకేష్‌కు మంగలగిరి ప్రజలు గట్టిగా తీర్పు ఇచ్చిన కూడా చంద్రబాబుకు జ్ఞానోదయం కలుగడం లేదన్నారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు రాజధాని పేరుతో రైతుల భూములు లాక్కొని మోసం చేశారన్నారు. ఆయన చేసిన పనికి ఇటీవల రైతులు రాజధాని ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబుపై రాళ్లు, చెప్పులు వేశారని గగ్గొలు పెడుతున్నారన్నారు. 40 ఏళ్ల అనుభవమైనా, నాలుగేళ్ల అనుభవమైనా ప్రజల జీవితాలతో ఆడుకుంటే ఈ విధంగానే శాస్తి జరుగుతుందని ప్రజలు ఇటీవల తీర్పు ఇచ్చారు. ప్రజలకు కీడు చేస్తే ఓటుతో బుద్ధి చెబుతారని, చంద్రబాబుకు 23 స్థానాలు ఇచ్చి సన్మానం చేసినా ఆయనలో మార్పు రావడం లేదన్నారు. చంద్రబాబు చిన్న లాజీక్‌ మిస్‌ అవుతున్నారు. ఇటీవల టీడీపీ నేతలు రాజధాని పర్యటనలో చంద్రబాబుపై దాఇ చేశారని గవర్నర్‌ను కలిశారన్నారు. ఈ సమయంలో ఆ పార్టీ నేత అచ్చెన్నాయయుడు ఓ కర్ర తెచ్చి ఇది ఎవరిదో సమాధానం చెప్పాలని డీజీపీని అడుగుతున్నారని, రాళ్లు, చెప్పులు కూడా తీసుకొచ్చి ఈ చెప్పులు ఏ కంపెనీవో సమాధానం చెప్పాలని కోరుతారేమో అని ఎద్దేవా చేశారు. రాజధాని ఘటనపై ఇటీవల ఐజీ విచారణ జరిపారని  ఆమె తెలిపారు. చంద్రబాబు హయాంలో సిట్‌ అంటే ఆ సంస్థ అసలు పని చేయలేదని, ఇలాగే జరుగుతుందని ఆయనలో భయం పట్టుకుందన్నారు. మా ప్రభుత్వంలో ఏ విచారణ అయినా నిష్పక్షపాతంగా జరుపుతామన్నారు. తెనాలి నుంచి ఫెయిడ్‌ ఆర్టీస్టులను తెచ్చుకుంది టీడీపీ నేతలే అన్నారు. ఆ రోజు రాజధాని రైతులు, కూలీలు కడుపు మండి నల్ల జెండాలతో చంద్రబాబుకు నిరసన తెలిపారన్నారు. వారిని ఒక టెర్రలిస్టులుగా చిత్రీకరించారన్నారు. ప్రజలు తీర్పు ఇచ్చిన తరువాత కూడా టీడీపీ నేతల్లో ప్రశ్చాతాపం కలుగడం లేదన్నారు. రాజధాని పేరుతో గ్రాఫిక్స్‌ చూపించి బలవంతంగా భూములు తీసుకున్నారని విమర్శించారు. బాహుబలి సినిమాలోని మాయిశ్మతి సెట్టింగ్స్‌, గౌతమి శాతకర్ణి సినిమాలోని అమరావతి సెట్టింగ్స్‌తో గ్రాఫిక్స్‌ చూపించారని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో పక్క రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఎవరో ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు. గతంలో చెరుకు తోటలు తగులబెట్టారో అందరికి తెలుసు అన్నారు. రైతుల హృదయాలపై కారం చల్లి తగుదునమ్మ అంటూ రాజధాని ప్రాంతంలో పర్యటించడం ఎంతవరకు న్యాయమన్నారు. ఇది చాలదన్నట్లుగా ఈ నెల 5వ తేదీ  విజయవాడలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం దుర్మార్గమన్నారు. ఇలాంటి సమావేశాలు విజయవాడలో కాకుండా మీరు గ్రాఫిక్స్‌లో కట్టిన అమరావతికి తీసుకొచ్చి ఆ మేధావులతో పాటు జర్నలిస్టులకు చూపిస్తే..వాస్తవాలు తెలుస్తాయన్నారు. రాజధాని ప్రాంతంలో అన్ని జిల్లెడు మొక్కలు, బీడుబారిన భూములు కనిపిస్తాయన్నారు. వాళ్లందరికీ మీరు రాజధాని ప్రాంతం చూపిస్తే..అది అమరావతి కాదు..భ్రమరావతి అని తేలిపోతుందన్నారు. రాజధాని పేరుతో ఐదేళ్లు చంద్రబాబు కాలయాపన చేశారని, సింగపూర్‌ వెళ్తే అలాంటి రాజధాని కడుతానంటారు..లండన్‌ వెళ్తే ట్రైన్‌ తెస్తానంటారు. దావూస్‌ వెళ్తే బుల్లెట్‌ ట్రైన్‌ అని వందల కోట్లు కొల్లగొట్టారని విమర్శించారు. రాజధానిలో  ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని పేర్కొన్నారు.రాజధాని ఇక్కడఅక్కడ అంటూ మీ బినామీలతో భూములు కొనుగోలు చేయించి దోచుకున్నారని మండిపడ్డారు. రైతులకు కౌలు ఇస్తానని చెప్పి భూములు తీసుకున్న చంద్రబాబు దగా చేశారన్నారు. ఇష్టమైన కంపెనీలకు పప్పుబెల్లాల మాదిరిగా పంచిపెట్టారన్నారు. ఓటుకు కోట్లు కేసుతో హైదరాబాద్‌ నుంచి పరుగెత్తుకొని వచ్చింది వాస్తవం కాదా అన్నారు. అందుకే నిన్ను నమ్మం బాబు అంటూ చిత్తు చిత్తుగా ఓడించారని తెలిపారు. అసెంబ్లీ బిల్డింగ్‌ నిర్మాణంలోనే రూ.120 కోట్లు అయ్యే దాన్ని రూ.1500 కోట్లకు పెంచారని, ఇందులోనే వెయ్యి కోట్లు దోచేశారని పేర్కొన్నారు. తాత్కాలిక సచివాలయం, హైకోర్టు భవనాలు నిర్మించారని, అక్కడ కనీసం టీ కూడా దొరకని పరిస్థితి నెలకొందని ఉద్యోగులు పేర్కొంటున్నట్లు చెప్పారు. చిన్న వర్షం కురిస్తే చాలు మీరు కట్టించిన భవనాలు నీరు కారిపోతున్నాయని తెలిపారు. గాలికి జనరేటర్‌ గోడ కూడా కూలిపోయి ఒకరు చనిపోయారని గుర్తు చేశారు. నాసిరకంగా నిర్మాణాలు చేపట్టి అందులో కూడా డబ్బులు నొక్కేశారని విమర్శించారు. అసైన్డు భూములు 2 వేల ఎకరాలను తక్కువ రేటుకు తీసుకొని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేశారని ఎమ్మెల్యే శ్రీదేవి విమర్శించారు.
 

Read Also: అమెజాన్‌తో ఆప్కో ఒప్పందం

Back to Top