దేశంలోనే అత్యధిక పెన్షన్లు అందిస్తున్న రాష్ట్రం మనదే..

వైయ‌స్ఆర్ సీపీ ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి

వైయస్ఆర్ జిల్లా : అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ పింఛ‌న్లు అందుతున్నాయ‌ని, మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్ర‌కారం ప్ర‌తి ఏటా సామాజిక పింఛ‌న్ల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పెంచుకుంటూ వెళ్తున్నార‌ని, కొత్త సంవ‌త్స‌రం ప్రారంభం రోజున ల‌బ్ధిదారులు రూ.2750 పెన్ష‌న్ అందుకున్నార‌ని క‌మ‌లాపురం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పి.ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 64.06 ల‌క్ష‌ల మందికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పెన్షన్లు అందిస్తున్నార‌ని, దేశంలోనే అత్య‌ధికంగా పెన్ష‌న్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని చెప్పారు.

క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని వీర‌ప‌నాయ‌నిప‌ల్లి మండ‌లం ఎస్‌.పాల‌గిరి గ్రామ స‌చివాల‌య ప‌రిధిలోని నేల‌తిమ్మ‌య్య‌గారి ప‌ల్లి, ఓబుల్‌రెడ్డిపల్లి, గోనుమకుల పల్లె, మ‌ర్రిపల్లి గ్రామాల్లో  గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యారు. ఆయా గ్రామాల్లోని ప్ర‌తి గ‌డ‌ప‌కూ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా ఆ ఇంటికి ఎంత లబ్ధి చేకూరిందో వివరించారు. ప్రభుత్వ యంత్రాంగంతో ప్ర‌జ‌ల ఇంటి వద్దకే వచ్చామని, సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ప్ర‌జ‌ల‌ను ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి కోరారు. ప్ర‌జ‌లు వివ‌రించిన స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో మండల అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top