అమరావతి: వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ తొలి బడ్జెట్‌లో గిరిజనులకు పెద్ద పీట వేశారని గిరిజన ఎమ్మెల్యే రాజన్న దొర పేర్కొన్నారు. గతంతో పోల్చితే రూ.711 కోట్లు అధికంగా కేటాయింపులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయన్నారు. జగనన్న వచ్చాడు..నవరత్నాలు తెచచారు. ప్రజలందరికీ ఇచ్చారు. అందుకే వైయస్ జగన్ ప్రజల మనిషి అయ్యారని, ఈ బడ్జెట్ ప్రజల బడ్జెట్ అయ్యిందని వివరించారు. గతంలో చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపారని, గ్రాఫిక్స్‌లో అమరావతి చూపించారని ఎద్దేవా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించారన్నారు. టీడీపీ ప్రభుత్వం కులాలు, మతాలు, ప్రాంతాలు, రాజకీయాలతో సంక్షేమ పథకాలు అమలు చేసిందని విమర్శించారు. వైయస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ బడుగు, బలహీన వర్గాలకు పెద్ద పీట వేశారని తెలిపారు. వైయస్‌ఆర్ చేయూత ద్వారా మహిళలకు రూ.75 వేలు ఆర్థిక లబ్ధి చేకూరుతుందన్నారు. జగనన్న అమ్మ ఒడి పథకం గొప్పదని వివరించారు. మానవత్వం ఉన్న ప్రభుత్వం ఇదని వివరించారు.