కుల‌, మ‌త‌, పార్టీల‌క‌తీతంగా సంక్షేమ ప‌థ‌కాలు

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న ప‌ట్ల ప్ర‌జ‌లంతా హ‌ర్షం

శెట్టివారిప‌ల్లెలో `గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న‌ప్ర‌భుత్వం`లో ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి

మైదుకూరు: దేశంలో ఎక్కడా లేని విధంగా కుల, మత, పార్టీలకతీతంగా అర్హత ఉన్న పేద ప్రజలందరికీ  సంక్షేమ పథకాలను అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ అని మైదుకూరు ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి అన్నారు. శనివారం మైదుకూరు మునిసిపాలిటీ పరిధిలోని శెట్టివారిపల్లె గ్రామంలో ``గడప గడపకు మన ప్రభుత్వం`` కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు చేరుతున్నాయని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబం లబ్ది చేకూరిందని  ఎంతో ఆనందంగా తెలిపారు. రాష్ట్ర  ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వారికి వివరించి, ముఖ్యమంత్రి సంతకం చేసిన ఉత్తరాన్ని, బుక్ లెట్‌ను ప్ర‌జ‌ల‌కు అంద‌జేశారు. భ‌వాని అనే మహిళ.. త‌న‌కు ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల ద్వారా రూ.1.23 ల‌క్ష‌ల లబ్ధి చేకూరిందని ఆనందం వ్యక్తం చేసింది. పీరమ్మ అనే మహిళ త‌మ కుటుంబం రూ.1.71 ల‌క్ష‌ల లబ్ధి పొందామని, దస్తగిరమ్మ అనే మహిళ రూ.1.36 ల‌క్ష‌ల లబ్ది కలిగిందని, సుబ్బమ్మ అనే మహిళ రూ.1.30 ల‌క్ష‌ల లబ్ధి చేకూరిందని ఆనందం వ్యక్తం చేసింది.

ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి మాట్లాడుతూ.. మూడేళ్ల పాలనలో మేనిఫెస్టోలో  ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నవరత్నాల రూపంలో ప్రవేశపెట్టి  అమలు చేసిన ఘనత సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఏదో ఒక పథకం ద్వారా ప్రతి గడపకు రూ.50 వేల నుంచి రూ.3 లక్షల వరకు లబ్ది చేకూరిందని ల‌బ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నార‌న్నారు. రాష్ట్రంలో ని అన్ని వర్గాల అభివృద్ధి కోసం అహర్నిశలు ఆలోచించే  ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ పాల‌న‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నార‌న్నారు. 

Back to Top