జూలకంటి బ్రహ్మారెడ్డిపై ఎమ్మెల్యే పిన్నెల్లి ఫైర్‌

పల్నాడు: మాచర్ల టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డిపై వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలకంటి బ్రహ్మారెడ్డిది మర్డర్లు చేసే చరిత్ర.. అభివృద్ధి చేసే చరిత్ర తమది అని చెప్పారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. పల్నాడు జిల్లాలో జరిగిన అల్లర్లపై సిట్టింగ్‌ జడ్జితో విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. 7 మర్డర్ల కేసులో ఏ–1 ముద్దాయిగా  బ్రహ్మారెడ్డి ఉన్నాడని గుర్తుచేశారు. జూలకంటి బ్రహ్మారెడ్డి దుర్మార్గుడు, నీచుడు అని మండిపడ్డారు. 2009 ఎన్నికల్లో తనపై ఓడిపోయి మాచర్ల నుంచి పారిపోయాడన్నారు. తాను మాచర్ల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు. చందాలపై బతికే వ్యక్తి జూలకంటి బ్రహ్మారెడ్డి అని ధ్వజమెత్తారు. 
 

Back to Top