వలంటీర్‌ వ్యవస్థ అంటే ఎల్లోమీడియాకు భయమెందుకు..?

సుపరిపాలనకు కేరాఫ్‌ అడ్రస్‌ సీఎం వైయస్‌ జగన్‌

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ: నిస్వార్థంగా ప్రజలకు సేవలు అందిస్తున్న వలంటీర్‌ వ్యవస్థపై ఈనాడు పత్రిక తప్పుడు కథనాలు రాస్తోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా పనిచేస్తున్న వలంటీర్‌ వ్యవస్థపై ఈనాడు రామోజీరావు విషం కక్కుతున్నాడని మండిపడ్డారు. వలంటీర్లపై ఈనాడు పత్రిక అసత్య ప్రచారాన్ని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడంలో వలంటీర్లు విశేషంగా కృషిచేస్తున్నారని, కోవిడ్‌ సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా వలంటీర్లు అద్భుతమైన సేవలందించారని గుర్తుచేశారు. వలంటీర్‌ వ్యవస్థ అంటే ఎల్లోమీడియాకు భయమెందుకు..? అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబు అరాచకం సృష్టించాడని, ఏ పథకం కావాలన్నా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి గతంలో ఉండేదన్నారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో ఎక్కడా లంచాలకు, వివక్షకు తావులేదని, సంక్షేమ సాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ అవుతుంద‌ని చెప్పారు. సుపరిపాలనకు కేరాఫ్‌ అడ్రస్‌గా సీఎం వైయస్‌ జగన్‌ నిలిచారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు చెప్పారు. 

Back to Top