అమరావతి: వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు గిరిజన హక్కులు గురించి మాట్లాడితే టీడీపీ సభ్యులు పోలవరం పేరుతో అడ్డుకోవడాన్ని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఖండించారు. ఏపీ అసెంబ్లీ పాయింట్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి పోలవరం గురించి క్లియర్ స్టేట్‌మెంట్ ఇచ్చారన్నారు. తెలుగుదేశం పార్టీ పోలవరంపై మాట్లాడే నైతిక హక్కు లేదు. నాలుగు నెలల పాటు ప్లడ్ వస్తుందని.. నవంబర్ 1 నుంచి పనులు ప్రారంభిస్తున్నామని సీఎం జగన్ స్పష్టంగా చెప్పారన్నారు. పోలవరం పై వివరణ వచ్చినా రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.పోలవరం ప్రాజెక్టులో గత ఐదేళ్లలో జరిగిన అవినీతి మీద నిపుణుల కమిటీ వేయడం జరిగిందని 15 రోజుల్లో నివేదిక వస్తుందన్నారు.సుమారు 1000 నుంచి 1500 కోట్లు రూపాయలు రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు మిగిలే అవకాశం ఉందని సీఎం వైయస్ జగన్ వివరణ ఇస్తే..తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పోడియం దగ్గరకు వచ్చి సభను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. శాసన సభను రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నారు.ఏపీ ప్రజలకు చంద్రబాబు అన్యాయం చేశారన్నారు. వరద ఉన్నప్పుడు పోలవరం పనులు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు.టీడీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారు తప్ప నిర్వాసితులను పట్టించుకోలేదన్నారు.