ప్రతి స్లాబూ లీకేజే..ఇదీ బాబు ప్రపంచ టెక్నాలజీ

కొట్టు సత్యనారాయణ
 

తాడేపల్లి గూడెంలో టిడ్కో హౌజింగ్ కట్టించారు. ఎమ్.ఎన్.టి దీని నిర్మాణాలు చేసింది. ఇదంతా ఇంటర్నేషనల్ టెక్నాలజీ లో కడుతున్నామన్నారు. ఎందుకంటే 300 చదరపు అడుగుల ఇల్లుకట్టడానికి ఆరున్నర లక్షలకు పైన కలెక్ట్ చేసారు. రాష్ట్ర ప్రభుత్వం లక్షా యాభై వేలు, కేంద్ర ప్రభుత్వం లక్షా యాభై వేలు సబ్సిడీ ఇస్తోంది. ఈ మూడు లక్షలు ఎర చూపించి మరో మూడున్నర లక్షల బ్యాంకు పేదవాడి నెత్తిమీద పెట్టి 20 సంవత్సరాలు కడుతూ వెళ్లమని చెప్పారు. వైయస్సార్ టైమ్ లో తాడేపల్లిలో 59 ఎకరాలు సేకరించి, ఐదున్నర కోట్లు ఖర్చు చేసి సైట్ లెవలింగ్ కూడా పూర్తి చేసి ఉంచాం. ఆ తర్వాత వచ్చిన నాయకులు పట్టించుకోక కొన్నేళ్లు వదిలేసారు. గత ప్రభుత్వం అక్కడ టిడ్కో హౌజింగ్ కట్టారు. ఇంటర్నేషనల్ టెక్నాలజీ లో 6000 లబ్దిదారులకు 5376 మందికి ఇళ్లు కట్టించారు. ఇప్పుడు వాళ్లందరూ వాడిన వాటర్ ఎటు వెళ్లాలో తెలీని విధంగా ఉన్నాయి ఆ ఇళ్లు. ఇంటర్నేషనల్ టెక్నాలజీలో బాబు కట్టించిన ఇళ్లు ఇలా ఉంటాయి. ఆ టెక్నాలజీతో కడితే ఇంట్లోంచి డ్రెయిన్ వాటర్ బయటకు వెళ్లే ప్రొవిజన్ ఉండదు. ఎస్టీపీ ఏర్పాటు చేసారు కానీ అక్కడనుంచి నీరు పారే అవకాశం ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు దానికోసం మరో 6 కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చుపెట్టి సరి చేయాల్సి వచ్చింది. అంతే కాదు ప్రతి స్లాబూ లీకేజే ఉంది. ఇదీ బాబుగారి ప్రపంచ టెక్నాలజీ. టిడ్కో అధికారులను పిలిచి వెళ్లి సమీక్షించాను. బైయట బిల్డర్లు చదరపు అడుగుకు రూ.1000 నుంచి రూ.1500 కు చేస్తుంటే బల్క్ ఆర్డర్లో తీసుకున్న ఇంటర్నేషనల్ టెక్నాలజీతో నీళ్లుకారే, డ్రెయిన్ లేని ఇళ్లకు చ.అకు రూ.2000 కు పైగా ఖర్చు పెట్టిన ఘనత గత టీడీపీ ప్రభుత్వానిది. లీకేజీ కావడమే ఇంటర్నేషనల్ టెక్నాలజీ ప్రత్యేకత.
వైయస్సార్ కట్టిన రాజీవ్ గృహ కల్ప ఇళ్లు పిచ్చుకగూళ్లు అంటున్న టీడీపీ నేతలకు సవాల్ చేస్తున్నా. 280 అడుగుల ఇల్లు లక్షరూపాయిలతో కట్టించి ఇచ్చారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. 

   
Back to Top