వైయస్‌ జగన్‌ పాలనలో రాష్ట్రం ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మారింది

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు

అసెంబ్లీ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం నేడు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని, ప్రతి నిరుపేదకు ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్‌ వైద్యం ఉచితంగా అందుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు చెప్పారు. అసెంబ్లీలో వైద్యరంగంపై చర్చలో ఎమ్మెల్యే శ్రీనివాసులు పాల్గొని మాట్లాడారు. మంచాన పడిన రోగులు ఆస్పత్రికి వెళ్లి ఉచితంగా చికిత్స పొంది క్షేమంగా ఇళ్లు చేరి.. వారి ఇంట్లో సీఎం వైయస్‌ జగన్‌ ఫొటో పెట్టుకొని ఆనందపడుతున్నారని, ఇలాంటి సంఘటనలు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లినప్పుడు కనిపించాయని చెప్పారు. 2014–19లో గత ప్రభుత్వం దాదాపు 23 లక్షల మంది కుటుంబాలకు ఆరోగ్య సేవలు అందిస్తే.. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం గడిచిన మూడున్నరేళ్లలో దాదాపు 48 లక్షల కుటుంబాలకు ఆరోగ్య సేవలు అందించిందని చెప్పారు. 

గత ప్రభుత్వం విద్య, వైద్య రంగాలను నిర్లక్ష్యం చేసిందని చెప్పారు. గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీకి కుటుంబ తలసరి ఆదాయం 3.5 లక్షలుగా నిర్ణయిస్తే.. దాన్ని 5 లక్షలకు పెంచి దాదాపు 1.47 కోట్ల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్న ఘనత సీఎం వైయస్‌ జగన్‌దేనని చెప్పారు. పక్క రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణల్లోని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నామన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ విద్య, వైద్య రంగానికి ప్రాధాన్యమిచ్చారు. కుల, మత, ప్రాంత, వర్గ, ఆఖరికి ఏ పార్టీ అనే తేడా లేకుండా పథకాలు అందుతున్నాయని చెప్పారు. ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లు పెంచడంతో ఎంతోమందికి లబ్ధి చేకూరిందని వివరించారు. 
 

Back to Top