సీఎం వైయస్‌ జగన్‌ దేశానికి రోల్‌మోడల్‌

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు
 

అసెంబ్లీ: చరిత్రాత్మక దిశ యాక్టును తీసుకువచ్చి దేశంలో రోల్‌మోడల్‌ సీఎంగా వైయస్‌ జగన్‌ నిలిచారని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు చెప్పారు. మహిళలపై గౌరవం, బాధ్యత ఉంది కాబట్టే సీఎం వైయస్‌ జగన్‌ చిత్తశుద్ధితో దిశ యాక్టుకు శ్రీకారం చుట్టారని చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఎమ్మెల్యే శ్రీనివాసులు మాట్లాడుతూ.. సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం రైతు పక్షపాతి అని చెప్పారు. రైతుల మేలు కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 2700 మంది రైతులు చనిపోయారని, ఆ రైతు కుటుంబాలకు ఎక్కడ ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల్సి వస్తుందోనని చంద్రబాబు నాయుడు వారి పేర్లను రికార్డుల్లోకి చేర్చలేదన్నారు. అదే విధంగా చంద్రబాబు 92 శాతం మంది రైతులు సంతోషంగా ఉన్నారని గతంలో చెప్పారని, రైతుల కోసం వేసిన రాధాకృష్ణ కమిటీ బాబు వ్యాఖ్యలకు విరుద్ధంగా నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు. బాబు పాలనతో రైతులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు.. రుణమాఫీ జరగలేదని కమిటీ చెప్పిందన్నారు.
ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా రూ.7 లక్షలకు సీఎం వైయస్‌ జగన్‌ పెంచారన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల ఆత్మహత్యలు లేవన్నారు. చంద్రబాబు తన తోక పత్రికల ద్వారా ఆత్మహత్యలు సృష్టించే ప్రయత్నం చేసి.. ప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తున్నారన్నారు. ఇది రైతు ప్రభుత్వం, ప్రజలందరి ప్రభుత్వమని ఎమ్మెల్యే కొరుముట్ల చెప్పారు. 

 

తాజా వీడియోలు

Back to Top