సీఎం జగన్‌ అద్భుతమైన పాలన అందిస్తున్నారు.

గత ప్రభుత్వం రైతుల్ని మోసగించింది

ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ

 

అమరావతిః సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అద్భుతమైన పాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు.వైయస్‌ఆర్‌ జయంతిని రైతు దినోత్సవంగా నిర్ణయించడం హర్షణీయమన్నారు.రైతులను చైతన్యపర్చడంతో బాటు.. వారి సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు.రైతులను ఆదుకోవడంతో పాటు రైతులకు ప్రోత్సహాకాలు అందించడం ద్వారా వారిని  చైతన్యవంతుల్ని చేయడం ప్రశంసనీయమన్నారు. రైతు భరోసా పేరుతో రైతులకు పెట్టుబడి సాయం అందించడం అద్భుతమన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం ప్రకటించడం  పట్ల హర్షం వ్యక్తం చేశారు.  1500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కేవలం 391 మందిగా  గత ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపించడం దారుణమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మాయా మాటలు చెప్పి రైతులను మోసగించిందన్నారు. అందుకే  ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని రైతులు పక్కనబెట్టారన్నారు.

Back to Top