ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం అన్ని వర్గాలను వంచిందింది

ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి

రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలకు మోసం

శ్మాశానం లో శవాలను తీసేసి ఇసుక తోడుకున్నారు

రేయిన్‌గన్ల పేరుతో రూ.600 దోపిడీ

అమరావతి: ఐదేళ్ల టీడీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలను వంచించిందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. గవర్నర్‌ ధన్యవాద తీర్మానంపై ఆయన మాట్లాడారు. గవర్నర్‌ ప్రసంగానికి వందసార్లు ధన్యవాదాలు తెలపాలి. ఏ వర్గాన్ని కూడా ఆ ప్రసంగంలో విస్మరించలేదు. సమాజంలోని ప్రతి ఒక్కరికి మేలు జరిగేలా అన్ని వర్గాలకు మంచి చేశారు. ఇలాంటి మంచి చేసే వైయస్‌ జగన్‌కు ధన్యవాదాలు. టీడీపీ నేతలు బుచ్చయ్య చౌదరి తప్ప ఎవరూ కూడా చదవలేదు. మరోసారి టీడీపీ నేతలకు గవర్నర్‌ ప్రసంగం ప్రతులు ఇవ్వాలి. టీడీపీ గత మేనిఫెస్టోలో పెట్టింది ఏంటి? మారు మాట్లాడుతున్నది ఏంటో ఆలోచన చేయాలి. చేనేతలు, కురవలు, నాయీ బ్రాహ్మణులకు, యాదవులకు చంద్రబాబు ఏం చెప్పారో గుర్తుకు తెచ్చుకోండి.  మేనిఫెస్టోలో పెట్టింది ఏ ఒక్కటి నెరవేర్చకుండా అందర్ని మోసం చేశారు.

రైతులు, మహిళలు, విద్యార్థులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, సైకిల్స్‌ ఇస్తామని మోసం చేశారు. మా నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఇసుక దోపిడీ కోసం శవాలను పూడ్చే స్థలాన్ని కూడా వదల్లేదు. మా నియోజకవర్గంలో ప్రాజెక్టును ప్రారంభిస్తామని చెప్పిన చంద్రబాబు మోసం చేశారు. రూ.964 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటనలు  ఇచ్చారు. దాంట్లో  ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన రోజు సాయంత్రం 5 గంటలకు నీటిని పంపిణీ చేస్తున్నట్లు భూమి పూజ చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు.

రెయిన్‌గన్లతో కరువును పారద్రోలామని చంద్రబాబు చెప్పారు. అక్కడ రైతు పేరు గోవిందును తెచ్చారు. నాకు ఐదేకరాల పొలం ఉందని, నా పంట పచ్చగా ఉందని ప్రకటనలు ఇచ్చారు. మరుసటి రోజు గోవిందు ఎక్కడా అని విలేకరులు వెళ్తే..గోవిందుకు అసలు భూమే లేదు. దాదాపు రూ.600 కోట్లు మెక్కేశారు. ట్యాంకర్లతో నీరు తెచ్చి గొంతలో పోసి అది రెయిన్‌గన్‌ అన్నారు. గంగ పూజ అంటూ, ఏకవాక అంటూ పబ్లిసిటీ ఇచ్చారు. నీరు–చెట్టు పేరుతో వందల కోట్లు మెక్కేశారు. అసలు చెట్లు పెట్టకుండా, లేని చెట్లకు నీరు పోసినట్లు బిల్లులు చేసుకున్నారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top