చెంప చెల్లుమనిపించినా బుద్ధి రాలేదా..?

విశాఖ ప్రతిష్టను నాశనం చేసింది చంద్రబాబే..

కొడుకు భవిష్యత్తు ముగిసిపోయిందనే ప్రెస్టేషన్‌లో ఉన్నాడు

సవతి తల్లి ప్రేమ నటిస్తే విశాఖ ప్రజలు నమ్మరు బాబూ..

సీఎం వైయస్‌ జగన్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తారు

విశాఖ అభివృద్ధి సీఎం వైయస్‌ జగన్‌తోనే సాధ్యం

ఇప్పటికైనా చౌకబారు మాటలు మానుకో చంద్రబాబూ

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌

విశాఖపట్నం: నాలుగు నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు, అనేక చట్టాలు తీసుకువచ్చి ఇతర రాష్ట్రాలకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదర్శంగా నిలుస్తున్నారు. అది చూసి ఓర్వలేక చంద్రబాబు మతిపోయి.. మత్తెక్కి మాట్లాడుతున్నాడు. వారసుడు లోకేష్‌బాబు భవిష్యత్తు ముగిసిపోయిందనే ప్రెస్టేషన్‌తో చంద్రబాబు ప్రేలాపనలకు కారణంగా కనిపిస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. విశాఖపట్నం జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు విశాఖ నగరానికి చేసిన అభివృద్ధి ఏంటో చూపించాలన్నారు. విశాఖ ఆస్తులను ఎవరికి కట్టబెడదాం అనే ఆలోచనతోనే బతికాడు కానీ.. నగరానికి చేసిందేమీ లేదన్నారు. విశాఖపట్నానికి మంచి జరిగిందంటే అది దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే.. మళ్లీ సీఎం వైయస్‌ జగన్‌ నేతృత్వంలోనే విశాఖ అభివృద్ధి చెందుతుందన్నారు. 

ఆరు నెలల్లోనే మంచి కార్యక్రమాలు చేసి మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే రోజే చెప్పారని ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ గుర్తు చేశారు. సీఎం వైయస్‌ జగన్‌ ఆరు నెలల్లో దేశంలోనే గొప్ప ముఖ్యమంత్రి కాబోతున్నారని జోస్యం చెప్పారు. విశాఖపట్నానికి చంద్రబాబు ఏం చేశారో చెప్పాలన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ను ఎప్పుడు అమ్మేద్దాం.. బీహెచ్‌పీని ఎప్పుడు ఎల్‌ఎండ్‌టీకి ఇచ్చేద్దాం. చుట్టూ ఉన్న కొండలను ఎప్పుడు గీతంకి కట్టబెడదాం అనే ఆలోచనలు తప్పితే ఏరోజు అయినా విశాఖకు న్యాయం చేశారా చంద్రబాబూ అని ప్రశ్నించారు. ఓడిపోయిన తరువాత ఇప్పుడు విశాఖకు వచ్చి సవతి ప్రేమ నటిస్తే ప్రజలు మోసపోరన్నారు. మేనేజ్‌మెంట్‌ తప్పితే చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు.  

సొంతంగా పోటీ చేసి గెలిచిన ఒక్క ఎన్నికైనా చూపించండి చంద్రబాబూ అని ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ నిలదీశారు. 1995లో ఎన్టీఆర్‌ నుంచి వెన్నుపోటు పొడిచి అధికారం తీసుకున్న తరువాత నుంచి ప్రతి సారి పొత్తులతోనే గెలిచాడన్నారు.  2019లో ఒంటరిగా పోటీ చేస్తే చంద్రబాబు తాలూకా బలం, నాయకత్వ పటిమ, 40 సంవత్సరాల చరిత్ర ఏంటో.. ఎన్నికల ఫలితం ద్వారా ప్రజలు దేశానికి చూపించారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి 50 శాతం పైచిలుకు ఓట్లు వచ్చాయన్నారు. ప్రజలు అభిమానించి, ఆశీర్వదించి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేశారని, సీఎంగా వైయస్‌ జగన్‌ నాలుగు నెలల పాలనలోనే అనేక సంక్షేమ పథకాలు, అనేక చట్టాలు తీసుకువస్తే అది చూసి మతిపోయి చంద్రబాబు మాట్లాడుతున్నాడన్నారు. 
 
ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తున్నానని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు.. అదే రాజధాని ప్రాంతం నుంచి వారసుడు లోకేష్‌ను పోటీ చేయిస్తే ప్రజలు చెంప చెల్లుమనిపించేలా తీర్పు ఇచ్చారన్నారు. అయినా చంద్రబాబుకు బుద్ధి రానట్లుందని, మతిభ్రమించినట్లుగా మాట్లాడుతున్నారన్నారు. శాంతిభద్రత గురించి చంద్రబాబు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. పోలీసులను 14 ఏళ్లు జైల్లో పెడతానని స్టేట్‌మెంట్‌ ఇస్తున్నాడని, గత ఐదు సంవత్సరాలు పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పనిచేశారా.. బాబూ.. అని ఎమ్మెల్యే అమర్‌నాథ్‌ ప్రశ్నించారు. సీఎం వైయస్‌ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగితే ప్రాథమిక దర్యాప్తు చేయకుండా అప్పటి డీజీపీ, చంద్రబాబు ప్రెస్‌ ముందుకు వచ్చి వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలే దాడి చేశారని అవహేళనగా మాట్లాడారన్నారు. విశాఖలో వందల ఎకరాలు దోచుకున్నారని అప్పటి చంద్రబాబు కేబినెట్‌లోని మంత్రే స్వయంగా ప్రెస్‌కు చెబితే బాబు ఇద్దరు మంత్రులను పిలిచి సెటిల్‌మెంట్‌ చేశారని గుర్తు చేశారు. విశాఖ ప్రతిష్టను ఇంతగా దిగజార్చిన చంద్రబాబు.. ఇవాళ విశాఖకు వచ్చి సానుభూతి మాటలు మాట్లాడితే ప్రజలంతా నవ్వుకుంటున్నారన్నారు. విశాఖ అభివృద్ధి గతంలో వైయస్‌ఆర్‌.. ప్రస్తుతం సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని చెప్పారు. ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకొని మాట్లాడాలని, చౌకబారు మాటలు మానుకోవాలని సూచించారు. 
 

తాజా ఫోటోలు

Back to Top