అవినీతి బయటపడుతుందనే ప్రతిపక్ష ఆందోళన

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

అసెంబ్లీ: ఐదేళ్లలో రాజధాని విషయంలో చంద్రబాబు, ఆయన తాబేదారులు చేసిన అవినీతి బయటపడుతుందనే శాసనసభలో ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీలో గడికోట మాట్లాడుతూ.. ‘అసెంబ్లీలో చాలా క్లీయర్‌గా పేర్లతో సహా అవినీతి బయటకు వచ్చినప్పుడు అది చూసి భయపడి స్వయంగా చంద్రబాబు లేచి వెళ్లండి గొడవ చేయండి అని సభ్యులను స్పీకర్‌ పోడియం దగ్గరకు పంపించారు. వాస్తవాలు ప్రజలకు తెలియకూడదని ప్రతిపక్షం గొడవ చేస్తుంది. సభలో ప్రతిపక్షనేత చంద్రబాబుకు మాట్లాడే అవకాశం ఇచ్చినా కూడా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా.. చేసిన అవినీతిని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన బయటపెడుతున్నారని ఉలిక్కిపడి గొడవ చేయడం సమంజసమా..? వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష సభ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్పీకర్‌ను కోరారు.

రాజధానిలో టీడీపీ చేసిన అవినీతి బయటపడుతుందని సభలో ఆందోళన చేస్తున్న ప్రతిపక్ష సభ్యులను స్పీకర్‌ తమ్మినేని సీతారాం సస్పెండ్‌ చేశారు. నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, రామకృష్ణబాబు, బి. అశోక్, రామ్మోహన్, సాంబశివరావు, బాలవీరాంజనేయస్వామి, గిరిధర్‌రావు, సత్యప్రసాద్‌లను ఒక్కరోజు సస్పెండ్‌ చేశారు.

Back to Top