చంద్రబాబు వ్యాఖ్యలు తీవ్రవాదుల కంటే డేంజర్‌

42 మంది జవాన్లు చనిపోతే పాకిస్తాన్‌కు చంద్రబాబు మద్దతివ్వడం విడ్డూరం

చంద్రబాబుపై రాజద్రోహం కేసు నమోదు చేయాలి

కూతురును చూడటానికి వైయస్‌ జగన్‌ లండన్‌ వెళ్తే తప్పా..?

జననేత లండన్‌ పర్యటనను తప్పుదోవపట్టిస్తూ వ్యాఖ్యలు

చింతమనేనికి సపోర్టు చేసేలా చంద్రబాబు మాటలు

విదేశీ డబ్బులపై వైయస్‌ జగన్‌ విసిరిన చాలెంజ్‌కు సమాధానం ఏదీ?

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి

హైదరాబాద్‌: చంద్రబాబు వ్యాఖ్యలు తీవ్రవాదులకంటే డేంజర్‌గా ఉన్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. స్వార్థ రాజకీయాల కోసం పూల్వామా సంఘటనను కూడా వాడుకుంటున్నాడని, 42 మంది సైనికులు వీర మరణం చెందితే చంద్రబాబు ఇమ్రాన్‌ ఖాన్‌కు మద్దతు ఇచ్చేలా వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎదురుదాడి సిద్ధాంతాలు, కుల రాజకీయాలు, శవ రాజకీయాలు చంద్రబాబుకే చెల్లుబాటని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూతురును చూడటానికి లండన్‌ వెళ్తే జననేత పర్యటన గురించి తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంతో పనిలేదు.. నాదంతా ఓటు రాజకీయమే అని ప్రజాభిమానం కోల్పోయిన బాధలో చంద్రబాబు మాట్లాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కుర్చీకి ఉన్న విలువను చంద్రబాబు దిగజార్చుతున్నాడని మండిపడ్డారు. 

ప్రజా సమస్యలు గాలికివదిలేసి టెలికాన్ఫరెన్స్‌లు పెట్టి టీడీపీకి ఓటేయండి అని, ప్రతిపక్ష నేతను టార్గెట్‌ చేస్తూ మాట్లాడడం సిగ్గుచేటని గడికోట మండిపడ్డారు. అధికారుల చేతులు కట్టేసి టీడీపీ పబ్లిసిటీ పెంచే పనులు చంద్రబాబు వారితో చేయిస్తున్నారన్నారు. స్థాయిని మరిచి చంద్రబాబు మాట్లాడే మాటలు విని ప్రజలంతా నవ్వుకుంటున్నారన్నారు. దేశంలోనే సీనియర్‌ అని చెప్పుకునే చంద్రబాబు ఈ రకంగా వ్యవహరించవచ్చా అని ప్రశ్నించారు. నిజంగా ప్రజాభిమానం ఉంటే ధైర్యంగా ఎన్నికలకు వెళ్లాలని సూచించారు. గంట గంటకు జీఓలు మార్పు చేయడం ఏంటీ.. అని నిలదీశారు. 

సుదీర్ఘ పాదయాత్ర చేసి, అనునిత్యం ప్రజల కోసం పాటుపడుతున్న వ్యక్తి వైయస్‌ జగన్‌ అని గడికోట అన్నారు. ఎన్నికలు వస్తాయి బిజీ అయిపోతాం రెండు రోజులు కూతురును చూసి వద్దామని వెళ్తే హవాలా వ్యవహారాల కోసం వెళ్లాడని చంద్రబాబు మాట్లాడడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలియవు, మనుషుల భావాలు అర్థం చేసుకోలేడు. ఆయనొక రోబో అని టీడీపీ నేతలే చెబుతున్నారన్నారు. ఆ రోబో వ్యక్తిగత స్వార్థం కోసమే పనిచేస్తుందని కూడా అన్నారని గుర్తు చేశారు. వైయస్‌ ఫ్యామిలీని గత 30 ఏళ్లుగా టార్గెట్‌ చేసి లేనివి ఉన్నట్లుగా, కించపరిచేట్లుగా మాట్లాడడంలో చంద్రబాబు పీహెచ్‌డీ చేశాడన్నారు. 

కశ్మీర్‌లో జరిగిన సంఘటనలో 42 మంది ప్రాణాలు కోల్పోతే కన్నీరు పెట్టని మనిషి లేడని, కానీ చంద్రబాబు మాత్రం బాధపడకపోగా, విలువలను దిగజార్చుతూ ఇమ్రాన్‌ఖాన్‌కు మద్దుగా మాట్లాడుతున్నాడన్నారు. చంద్రబాబు స్థితిని ఏమనుకోవాలన్నారు. ఆ దురదృష్టకర సంఘటన నుంచి దేశం ఇంకా కోలుకోలేదన్నారు. ఈ మాటలు మాట్లాడినందుకు చంద్రబాబుపై రాజద్రోహం కేసు పెట్టవచ్చన్నారు. ఇమ్రాన్‌ఖాన్‌ నుంచి చంద్రబాబుకు ఇమ్రాన్‌ఖాన్‌ నుంచి ఎన్ని ముడుపులు ముట్టాయని అని ప్రశ్నించవచ్చు. కానీ మాకు సంస్కారం ఉంది. నువ్వు చేసేది తప్పు అని మాత్రమే చెప్పగలుగుతాం. తీవ్రవాదులకంటే డేజర్‌లా చంద్రబాబు మాటలు ఉన్నాయన్నారు. 

రెండ్రోజుల క్రితం గుంటూరులో బీసీ రైతు దుర్మార్గ చర్యలతో ప్రాణాలు కోల్పోయాడు. ఆ రైతు ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదు. మా కుటుంబ వ్యవహారాలు బాగున్నాయి. తనను కచ్చితంగా ప్రభుత్వమే హత్య చేసిందని మృతిచెందిన రైతు కుమారుడు చెబుతుంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తే కుల రాజకీయం అంటావా..? 

ఎవరు కుల రాజకీయాలు చేసేది. చంద్రబాబు పర్యటన కోసం ఆ రైతు భూమిని కబ్జా చేయాలని తనను నొప్పించి ప్రాణాలు కోల్పోయి విధంగా చేస్తే ప్రశ్నించొద్దా..? రైతును చంపితే ప్రశంసించాలా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

చింతమనేని సమాజం తలదించుకునేలా ఒరేయ్‌ దళితులు అని కించపరిచేలా మాట్లాడారని గడికోట మండిపడ్డారు. గతంలో చంద్రబాబు ఎస్సీల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారు అని మాట్లాడారని గుర్తు చేశారు. ఇంతకాలం రాజకీయాలు చేస్తూ మనుషులందరూ సమానం అని గమనించలేకపోతున్నారంటే  ఆశ్చర్యకరంగా ఉందన్నారు. చింతమనేని మాటాలను ఖండించకుండా సపోర్టు చేస్తున్నాడు. తప్పుచేసిన వారిని ప్రశ్నిస్తే కుల రాజకీయాలు అని చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. వీటన్నింటినీ తప్పుదోవ పట్టించేందుకు చంద్రబాబు తన అనుకూల మీడియాతో వైయస్‌ జగన్‌ లండన్‌ పర్యటనపై చర్చలు, డిబేట్‌లు పెట్టిస్తున్నాడన్నారు.  

ప్రజా సంకల్పయాత్ర మొదలు పెట్టిన మొదటి వారంలోనే వైయస్‌ జగన్‌ చాలెంజ్‌ విసిరారని గడికోట శ్రీకాంత్‌రెడ్డి గుర్తు చేశారు. విదేశాల్లో డబ్బు ఉందని పచ్చ పత్రికల్లో తప్పుడు కథనాలు ప్రచురిస్తే నెల రోజులు టైం ఇస్తున్నాను.. విదేశాల్లో ఎక్కడ డబ్బు ఉందో చెప్పాలని, నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, లేదంటే చంద్రబాబు రాజీనామా చేయాలని చాలెంజ్‌ విసిరారన్నారు. దానికి సమాధానం చెప్పుకోలేక అవినీతి అంటూ కొత్త డ్రామా ఆడుతున్నారన్నారు. నాలుగేళ్లు బీజేపీతో కలిసి సంసారం చేసిన చంద్రబాబు విదేశాల్లో వైయస్‌ జగన్‌కు డబ్బులు ఉన్నాయని ఎందుకు నిరూపించలేకపోయారని ప్రశ్నించారు. కుట్రపూరితంగా కేసులు పెట్టారని స్పష్టంగా అర్థం అవుతుందన్నారు. 

తాజా వీడియోలు

Back to Top