ల్యాబ్ టెస్టుల్లో 250కోట్లు లోకేష్ దోచుకున్నాడు

గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే

గత ప్రభుత్వ హాయంలో వైద్య రంగంలో సంవత్సరానికి ఒక విభాగంలోనే 50కోట్ల అవినీతి జరిగింది. ఏ టెస్టు చేసినా రూ.235 తీసుకుంది మెడాల్ సంస్థ. చిన్న సీబీపీ బ్లడ్ టెస్టు చేసినా బ్లడ్ సుగర్ టెస్ట్ చేసినా రూ.230 వసూల్ చేసారు. అపోలో ల్యాబ్ లో ఇవే టెస్టులు రూ.50 తీసుకుంటున్నారు. Hiv, HBSIG కానీ చిన్న స్టిప్ లో వస్తున్నాయి. వాటి ఖరీదు రూ.75 మాత్రమే. వాటికి కూడా ఆసంస్థకు రూ.235 చెల్లించింది ప్రభుత్వం అంటే ఎంత అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. తిరుపతిలోని ఒక్క రుయా ఆసుపత్రిలోనే ల్యాబ్ టెస్టుల్లో 45 కోట్ల రూపాయిల స్కామ్ జరిగింది. సీఎంగారు, ఉప ముఖ్యమంత్రిగారు దీనిపై విచారణ చేయాలి. గత ప్రభుత్వాధినేతలు ఇందులో ఎన్ని కోట్లు స్కామ్ చేసిందో దర్యాప్తు చేసి లెక్క తేల్చాలి.
నేడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో, పీహెచ్‌సీల్లో, ఏరియా ఆసుపత్రుల్లో సబ్ సెంటర్స్ లో కానీ ప్రభుత్వమే ఆటోమేటిక్ ఎనలైజర్స్ తో ఎక్విప్ మెంట్ కొంటే అంతా కలిపి 120కోట్లు ఖర్చైంది. గత ప్రభుత్వం సంవత్సరానికి 120 కోట్లు ఇచ్చారు. నేడు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా టెస్టులు చేయించడానికి సరిపోతుందీ మొత్తం. అదనంగా అయ్యే ఖర్చు ల్యాబ్ టెక్నీషియన్సు, ఎనలైజర్, లిక్విడ్ ఎక్యూప్ మెంట్స్ కు అవుతుంది. అది 10శాతం కూడా ఖర్చుండదు. దీనికోసం వీళ్లు ఇప్పటికి 600 కోట్లు దోచిపెట్టారు. మెడాల్ సంస్థలో లోకేష్ పాత్ర ఉంది. నారా లోకేషే దీన్ని సబ్ లీజ్ కి ఇచ్చాడు. సంవత్సరానికి 50 కోట్లు చొప్పున దోచుకున్నాడు. ఐదేళ్లకి గాను 250 కోట్లు ఇందులో దోచుకున్నాడు చినబాబు. దీనిపై కూడా నిజాలు తేల్చాలని ముఖ్యమంత్రిని కోరుతున్నా.

 

Back to Top