సీఎం జగనన్న గిరిజన పక్షపాతి

వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
 

 

అసెంబ్లీ: ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా కమిషన్‌ ఏర్పాటు చేస్తున్నందుకు ముఖ్యమంత్రికి 30 లక్షల గిరిజనుల తరుఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. గిరిజన పక్షపాతి సీఎం జగనన్న అని నిరూపించారు. ఆరు నెలల పాలనలో దేశ చరిత్రలో ఎవరూ చేయని విప్లవాత్మక నిర్ణయాలను జగనన్న ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రజల తరుఫున జగనన్నకు హ్యాట్సాఫ్‌ తెలిపారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మాట్లాడుతూ.. ప్రతిపక్షనేతగా 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలో గిరిజనుల కష్టాలను, సమస్యలను కళ్లారా చూశారు కాబట్టే గిరిజనులకు ప్రత్యేక కమిషన్‌ ఉంటే జీవితాలు బాగుపడతాయి.. సమాజంలో అందరితో పాటు అభివృద్ధి చెందగలరని ఎస్టీ కమీషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు గిరిజన గూడెంలలో తిరిగి ఆ ప్రజల సమస్యలను కష్టాలను కళ్లారా చూడడమే కాకుండా.. గిరిజనుల భాష కూడా నేర్చుకున్నారు. మా ఏరియాలో కోయ భాష మాట్లాడుతారు.. ఆ గూడెంలో బస చేసి వారి భాషను నేర్చుకొని భరోసా ఇచ్చారు. అందుకనే వైయస్‌ జగన్‌ను ఎస్సీ, ఎస్టీలు గుండెల్లో పెట్టుకున్నారు.

దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఎంతో కృషిచేశారు. ఎస్టీలకు ఉమ్మడి రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల భూములకు పట్టాలు కల్పించిన ఘనత వైయస్‌ఆర్‌కు దక్కుతుంది. అందుకనే గిరిజనులంతా వైయస్‌ఆర్‌ను ఆరాధ్యదైవంగా భావిస్తున్నారు. ఆయన తనయుడు, మన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆరునెలల పాలనలో అనేక పథకాలు ప్రవేశపెట్టారు. ఎన్ని చూసినా... ఏ పథకం చూసినా ఎస్సీ, ఎస్టీలకు లబ్ధిచేకూరుతుంది. చంద్రబాబు పాలనలో ఎస్సీ, ఎస్టీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారు. బాక్సైట్‌ తవ్వకం కోసం పెద్ద ఎత్తన గిరిజనులు పోరాటం చేస్తే.. గిరిజన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును ప్రలోభాలకు గురిచేసి ఫిరాయింపు చేయించి తెలుగుదేశంలోకి లాక్కొని ఆయన హత్యకు కూడా చంద్రబాబు కారణం అయ్యాడు. ఈ రోజు ఈ కమిషన్‌ వల్ల ఎస్టీలకు న్యాయం జరగబోతుందని ఎమ్మెల్యే బాలరాజు చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top