గుంటూరు: సమాజ శ్రేయస్సును కోరిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే అనిసమాజ శ్రేయస్సును కోరిన గొప్ప సంఘసంస్కర్త ఫూలే అని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) కొనియాడారు. ఫూలే ఆశయాలు, ఆలోచన విధానాల కొనసాగింపులో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారితో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. మంగళగిరి ఆటోనగర్లోని ఎమ్మెల్యే ఆర్కే కార్యాలయంలో మంగళవారం మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆర్కే, ఆప్కొ చైర్మన్ గంజి చిరంజీవి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ.. దశాబ్దాల క్రితమే భారతదేశం అభివృద్ధిని కాంక్షించిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని తెలిపారు. సమాజంలో కులాలు, మతాలు వర్గాల యొక్క హెచ్చుతగ్గుల నిర్మూలన కేవలం చదువు వల్ల మాత్రమే సాధ్యమని గ్రహించి భారత దేశ విద్య ప్రదాతగా జ్యోతిరావు పూలే నిలిచారన్నారు. ఆయన వారసుడిగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోయిందన్నారు.