ఓడించి ఇంట్లో కూర్చో బెట్టినా మార్పు రావడం లేదు

మంత్రి కొట్టు సత్యనారాయణ

 అమరావతి: లక్షల కోట్లు దోచుకున్నారు కాబట్టే గత ప్రభుత్వాన్ని ప్రజలు చీత్కరించారు.. అందుకే వారిని ఓడించి ఇంట్లో కూర్చో బెట్టినా మార్పు రావడం లేదని మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ అన్నారు.  గత ప్రభుత్వంలో జరిగిన స్కామ్ లు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటికి వస్తోందని, మొన్న అసెంబ్లీ సాక్షిగా ఆధారాలతో సహా రెండు స్కామ్‌లను బయటపెట్టినట్లు చెప్పారు.
సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డికి ఏదో రకంగా అడ్డంకులు సృష్టించడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. లేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లు విషపు రాతలు రాయిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఎల్లో మీడియా, చంద్రబాబు,దత్తపుత్రుడు కలిసి మాపై బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు.  
 

 

Back to Top