పాత సైకిల్, కొత్త గ్లాసు ..కొట్టుకుపోవాల్సిందే !

మంత్రి అంబ‌టి రాంబాబు ట్వీట్‌

విజ‌య‌వాడ‌:  రాష్ట్రంలో 175కు 175 శాస‌న స‌భ స్థానాల్లో విజయమే లక్ష్యంగా  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలకు శ్రేణు­లను సమాయత్తం చేసేందుకు దిశా నిర్దేశం చేశారు.  ఇవాళ విజయవాడ ఇందిరా గాంధీ మున్సి­పల్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన పార్టీ విస్తృత స్థాయి సమా­వేశంలో వైయ‌స్ జ‌గ‌న్ పార్టీ శ్రేణుల‌ను స‌మాయ‌త్తం చేశారు. ముఖ్య‌మంత్రి ప్ర‌సంగం అనంత‌రం మంత్రి అంబ‌టి రాంబాబు ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. 
పార్టీ ప్రతినిధుల  సభతో  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గేర్ మారింది, ఫ్యాన్ స్పీడ్ పెరిగింది. ఇక పాత సైకిల్, కొత్త గ్లాసు కొట్టుకుపోవాల్సిందే ! అంటూ అంబ‌టి రాంబాబు ట్వీట్ చేశారు. 

 గత 52 నెలలుగా సుపరి­పా­లన, సంక్షేమాభివృద్ధి పథకాల ద్వారా ప్రతి ఇం­టికీ, గ్రామానికీ, నియోజక­వర్గానికీ, జిల్లాకు, రాష్ట్రానికీ చేసిన మంచిని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప‌దాధికారుల స‌మావేశంలో ప్ర‌భావవంతంగా వివ‌రించారు.   ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా చేస్తున్న త‌ప్పుడు ప్ర‌చారాన్ని ఎక్కడికక్కడ తిప్పికొట్టడంపై ప్రతినిధులకు సీఎం వైయ‌స్‌ జగన్‌ దిశా నిర్దేశం చేశారు. అధికారంలోకి వచ్చాక విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు – పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్రం సమగ్రాభివృద్ధి దిశగా పరుగులెత్తిస్తున్న తీరును కళ్లకు కట్టినట్లుగా వివరించారు. ప్రగతిపథంలో రాష్ట్రం దూసుకెళ్లాలంటే మళ్లీ వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను సీఎం వివ‌రించారు. ‘రాష్ట్రానికి జగనే కావాలి’ (వై ఏపీ నీడ్స్‌ జగన్‌) కార్యక్రమాన్ని చేపట్టాల్సిన తీరుపై ప్రతినిధులకు మార్గ నిర్దేశం చేశారు. ఈ సమావేశానికి హాజరైన ప్రతినిధులు సీఎం సందేశాన్ని ఆస‌క్తిగా ఆల‌కించి నూత‌నోత్సాహంతో త‌మ స్వ‌స్థ‌లాల‌కు తిరిగి వెళ్లారు. 

Back to Top