గుంటూరు మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ తీరు దుర‌దృష్ట‌క‌రం

మేయ‌ర్ కావ‌టి మ‌నోహ‌ర్‌

గుంటూరు:  గుంటూరు మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ తీరు దుర‌దృష్ట‌క‌రమ‌ని మేయ‌ర్ కావ‌టి మ‌నోహ‌ర్ పేర్కొన్నారు. గురువారం గుంటూరులో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మేయ‌ర్ మాట్లాడుతూ.. స‌భ్యుల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌కుండా కౌన్సిల్ నుంచి క‌మిష‌న‌ర్ వెళ్లిపోయార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స‌మావేశంలో క‌మిష‌న‌ర్ దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని ఆక్షేపించారు. కౌన్సిల్ స‌మావేశం నిర్వ‌హించాల‌ని ఈ నెల 7న క‌మిష‌న‌ర్‌కు స‌మాచారం ఇచ్చినా ..ఆయ‌న స్పందించ‌లేద‌న్నారు. రేపు క‌మిష‌న‌ర్ వ్య‌వ‌హ‌రించే తీరును బ‌ట్టి భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తామ‌ని మేయ‌ర్ స్ప‌ష్టం చేశారు. 

న‌గ‌ర పాల‌క సంస్థ‌లో మేయ‌రే సుప్రీం:  మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు
గుంటూరు న‌గ‌ర పాల‌క సంస్థ‌లో మేయ‌ర్ కావ‌టి మ‌నోహ‌ర్ సుప్రీం అవుతార‌ని మాజీ మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్య‌క్షుడు అంబ‌టి రాంబాబు తెలిపారు. కౌన్సిల్‌లో క‌మిష‌న‌ర్ అహంకారంతో వ్య‌వ‌హ‌రించార‌ని ఆయ‌న త‌ప్పుప‌ట్టారు. క‌మిష‌న‌ర్ తీరును వైయ‌స్ఆర్‌సీపీ తీవ్రంగా ప‌రిగ‌ణించింద‌ని అంబ‌టి రాంబాబు పేర్కొన్నారు. క‌మిష‌న‌ర్ చ‌ట్ట ప్ర‌కారం న‌డుచుకోవాల‌ని సూచించారు. క‌మిష‌న‌ర్ తీరును త‌ప్పుప‌డుతూ ప్ర‌జాపోరాటం చేస్తామ‌ని మాజీ మంత్రి హెచ్చ‌రించారు. 

Back to Top