ఓటమి భయంతోనే తప్పుడు విమర్శలు

సంస్కారహీనులుగా మాట్లాడొద్దు

ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు

టీడీపీ నేతలు భూములు,మట్టిని దోచుకున్నారు

మంచి చేయడానికి రాజకీయాల్లోకి వచ్చా..

వైయస్‌ఆర్‌సీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు

విజయవాడ: నాపై స్థానిక ఎమ్మెల్యే వంశీ తప్పుడు విమర్శలు చేస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ గన్నవరం అసెంబ్లీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ధ్వజమెత్తారు.విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు తిరస్కరిస్తారన్న భయంతోనే  వంశీ ఆరోపణలు చేస్తున్నారన్నారు. నేను డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదని ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు వచ్చానన్నారు.మంచి చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు.ప్రజలకు సమస్యలు సృష్టించే రీతిలో పాలన సాగిందని మండిపడ్డారు.

టీడీపీ పాలనలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. మేం మట్టి దొంగలం కాదని..అజ్జనపూడిలో యాదవ, కైస్త్రవ భూములను దొంగిలించింది మేం కాదన్నారు.అది ఎవరో ప్రజలందరికి తెలుసునన్నారు. స్థానిక ఎమ్మెల్యే దురాగతాలను ప్రజలందరూ చెబుతున్నారన్నారు.వారు ఇచ్చిందే నేను మాట్లాడానని తెలిపారు.స్థానిక ఎమ్మెల్యేపై వ్యక్తిగత దూషణాలకు దిగలేదన్నారు.ప్రజలు చెప్పితే మాట్లాడనని తెలిపారు. బండారుగూడెం ప్రచారాని కి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి షిర్యాదు చేశారని..ఇద్దరు వ్యక్తులు తగాద పడితే పంచాయితీ చేసి ఖాళీ స్టాంపులపై సంతకాలు పెట్టించుకున్నారని తెలిపారన్నారు. 

ఉద్యోగం చేసి కష్టపడి సంపాదించిన డబ్బుతోనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు.ఎమ్మార్వోలను మండల రెవెన్యూ ఆఫీసర్లుగా పనిచేయించకుండా..మట్టి రెవెన్యూ ఆఫీసర్లుగా మార్చేసి చెరువులను తవ్వుకున్నారని ప్రశ్నించానని తెలిపారు. గన్నవరం నియోజకవర్గం శాంతికి నిలయం అన్నారు. ఓటమి భయంతోనే సంస్కారహీనులుగా మాట్లాడుతున్నారన్నారు. 13 జిల్లాల ప్రజలు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వస్తున్నారని,టీడీపీ నేతల అవినీతిపై విచారణ జరిపిస్తారనే భయంతో..గన్నవరం నియోజకవర్గం చేజారిపోయిందనే దు:ఖంతో మాట్లాడుతున్నారన్నారు.

తాజా ఫోటోలు

Back to Top